కోట్లకు కోట్లు ఎంత డబ్బు సంపాదించినా కడుపు నిండా అన్నం తినలేని వాళ్లు, కంటి నిండా నిద్ర పట్టని వాళ్ళు బిచ్చగాడి కన్నా ఎంతో దరిద్రులు అని మన పెద్దవాళ్లు అంటూ ఉంటారు. అయితే చిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్న కోట్లకు కోట్లు ఆస్తులు సంపాదించుకున్న అందరి హీరోల జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ తో వారికి నిద్ర పట్టదు ఎంత స్టార్ స్టేటస్ ఉన్న సోషల్ మీడియాలో వారి గురించి ఎప్పుడు ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది.
ఇలా ఇబ్బంది పడే వారిలో మొదటి స్థానంలో ఉంటాడు అక్కినేని నాగార్జున అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చిత్ర పరిశ్రమలో తనదైన స్టైల్లో సినిమాలు చేస్తూ మెప్పిస్తున్న నాగార్జున ఇద్దరు కొడుకులు జీవితాలు ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. అటు సినీ పరంగా- ఇటు పరసనల్ లైఫ్ లో చికాకులు కారణంగా మధ్య వారి జీవితం నలిగిపోతుంది. నాగచైతన్య- సమంతతో విడాకులు తీసుకుంటే.. అఖిల్ శ్రేయ భూపాల్ తో నిశ్చితార్థం తర్వాత బ్రేకప్ చెప్పేసాడు.
ఇప్పుడు వీరిద్దరికి మళ్ళీ పెళ్లి అవుతుందా ..? అసలు అక్కినేని ఇంటికి వారసులు వస్తారా..? అనే విషయాన్ని పక్కన పెడితే ..అసలు వీళ్ళు సినిమాలపరంగా ఈ అన్నదమ్ములు ఇద్దరం జీరో అని అంటున్నారు అభిమానులు. ఇప్పటికే చాలామంది హీరోలు తమ కేరీర్లో రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టారు. అయితే ఈ అక్కినేని హీరోలు మాత్రం ఇప్పటికీ రూ.50 కోట్ల క్లబ్ లోకి చేరడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వీరి సినీ కెరీర్ పరంగా వారి ఫ్యామిలీ పరంగా ఇద్దరి కొడుకులు నాగార్జునకి ప్రశాంతమైన జీవితం లేకుండా చేస్తున్నారట.
ఈ క్రమంలోని ఎన్ని కోట్లు ఆస్తి ఉన్నా సరే నాగార్జున తన కొడుకుల కారణంగా తృప్తి లేదని.. కొడుకులు సినీ కెరీర్ ప్లాఫ్ అయిందని.. మరోపక్క ఫ్యామిలీ కెరీర్ కూడా నాశనం అయిందని ఇప్పటికి బాధపడుతూనే ఉన్నారు. వీళ్ళ భవిష్యత్తు ఎలా మారిపోతుందో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనేది ఆ దేవుడికే తెలియాలి..!!