నాగార్జున హీరోయిన్‌ని టచ్ చేస్తే డైరెక్ట‌ర్‌కి పగిలిపోవాల్సిందేనా..?

హీరో, హీరోయిన్స్ మధ్య మంచి రిలేషన్ ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే నాగార్జున మాదిరిగా నిర్మాణ సంస్థ కూడా ఉంటే ఇక హీరోయిన్ వదిలే ఛాన్సే ఉండదు. అన్నపూర్ణ సంస్థ అధినేతగా, హీరోగా, బిజినెస్ మేన్‌గా నాగ్ ఎంతో పాపులర్. ఆయన సినిమాలలో హీరోయిన్స్ బాగానే సంపాదించుంటారనేది టాక్ ఉంది. ఆన్‌స్క్రీన్ రొమాన్స్ ఎంతగా చేస్తారో ఆఫ్‌స్క్రీన్ రొమాన్స్ అంతకంటే చేస్తారట. ఆయన సరసన నటించిన చాలామంది హీరోయిన్స్‌తో ఎఫైర్ ఉంటుందనే రూమర్స్ ఉన్నాయి.

Bangarraju Movie: మరోసారి నాగార్జునకు జోడీగా శ్రియ.. 'బంగార్రాజు'  సినిమాలో.. | Actress shriya saran will act in nagarjuna bangarraju movie |  TV9 Telugu

ముఖ్యంగా నిన్నే పెళ్ళాడతా సినిమాలో హీరోయిన్‌గా నటించిన టబు అంటే ఇప్పటికీ ఈ రూమర్స్ వినిపిస్తుంటాయి. నాగార్జున భార్య అమల స్వయంగా టబుకి దగ్గరుండి ఇల్లు కట్టించిందట. అది కూడా నాగార్జున ఇంటికి ఎదురుగానే అని చెప్పుకుంటుంటారు. ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా నాగార్జున హీరో అయితే ఆ సినిమాలో హీరోయిన్ ని ముట్టుకోనివ్వరట. ముందుగానే ఈ విషయం డైరెక్టర్స్ కి నిక్కచ్చిగా చెప్తాడట నాగ్. ఒకవేళ ఏ దర్శకుడైనా నాగ్ కి తెలియకుండా హీరోయిన్ ని టచ్ చేస్తే దవడలు వాస్తాయట.

ఎక్కడున్నాము అని కూడా చూడకుండా చేయి చేసుకుంటారనే టాక్ ఉంది. నాగార్జునకి రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ కి అమ్మాయిల ప్రొఫైల్స్ కుప్పలు కుప్పలుగా వస్తుంటాయి. ఆ దర్శకుడు తలుచుకుంటే గంటకో అమ్మాయిని పిలిపించుకోగలడు. అంత స్టార్ డైరెక్టర్ కూడా ఓ సినిమా షూటింగ్ సమయంలో టచ్ చేస్తే నాగార్జున వెంటనే రియాక్ట్ అయి చేయి చేసుకున్నాడట. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉంటే వారిని పిలిపించింది ఆ దర్శకుడే.

When Tabu Had Opened Up And Had Talked About Her Dating Rumours With  Nagarjuna

నాగ్ కి చెప్పే మేకప్ టెస్ట్ అండ్ ఫొటో షూట్స్ కూడా చేయించిన దర్శకుడు నాగార్జున కి చెప్పకుండా హీరోయిన్‌తో గడిపినందుకు లాగిపెట్టి కొట్టాడని అప్పట్లో ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో బాగా వైరల్ అయింది. నాగార్జునకి అంత జలసీ ఉంటుందట. కొంతకాలం శ్రియ తోనూ వ్యవహారం నడిపినట్టు చెప్పుకున్నారు. ఆ రకంగా నాగార్జున కంపెనీలో పరిచయమయ్యే హీరోయిన్స్ ఆయన పళ్ళతో సమానం అని అంటుంటారు.