సినిమా రంగం అనేది లక్కుపైనే ఆధారపడి ఉంటుందని కొందరు.. కాదు టాలెంట్‌పైనే ఆధారపడి ఉం టుందని మరికొందరు చెబుతుంటారు. అయితే.. ఈ రెండు కలిస్తేనే తప్ప.. సినీ ఫీల్డ్‌లో రాణించడం అంత తేలిక కాదని అంటారు ఎక్కువమంది. ఏది ఎలా ఉన్నప్పటికీ.. అగ్రహీరోల విషయానికి వస్తే..కొందరు సక్సెస్ సాధించడానికి చాలా కష్టపడ్డారనే చెప్పాలి. తొలినాళ్లలో నాలుగైదు సినిమాలు ఆడినా.. తర్వాత ఫెలయ్యారు.
మధ్యలో దాదాపు దశాబ్దకాలం పైగానే గ్యాప్ తీసుకున్నారు. ఇలాంటివారిలో బాలకృష్ణ, నాగార్జున, జగపతి బాబు, మోహన్‌బాబు ఇలా కొందరు ఉన్నారు. అయితే.. చిత్రం ఏంటంటే… వీరంతా 50 ఏళ్లు దాటిన తర్వాత.. పోషించిన 20 ఏళ్ల పాత్రల్లో ఇమిడిపోయి.. సక్సెస్ సాధించారు. నాగార్జున సినిమాల్లో హిట్‌గా నిలిచిన రాంగోపాల్ వర్మ మూవీ శివ.. సమయానికి నాగార్జున వయసు 45 ఏళ్లు.
ఆతర్వాత ఒకటి రెండు సినిమాలు హిట్టయినా.. తర్వాత.. కొన్ని ఫెయిలయ్యాయి. ఆ తర్వాత.. ఐదేళ్ల వరకు నాగార్జున ఎదురు చూడాల్సి వచ్చింది. అలానే బాలకృష్ణ కూడా.. తొలినాళ్లలో మంగమ్మగారి మనవడు వంటి హిట్ సినిమాలు అందించినా.. మధ్యలో చాలా సినిమాలు ఫెయిలయ్యాయి. దీంతో ఐదారేళ్లు గ్యాప్ తీసుకున్నారు. ఈయనకు ఏకంగా.. 50+ తర్వాత సినిమాలు హిట్టయ్యాయి.
కానీ, చిత్రంగా చిరంజీవి విషయంలో ఇంత భారీ గ్యాప్ ఎక్కడా కనిపించదు. చిరు నటించిన సినిమా ల్లోనూ కొన్ని విఫలమైనా..గ్రాఫ్ తగ్గకుండా.. ఆయన తీసుకున్న జాగ్రత్తలు ఇండస్ట్రీలో మెగా అభిమాను లను నిలబెట్టాయని అంటారు. అంటే.. మొత్తంగా.. ఇప్పుడు కుర్ర హీరోలుగా రాణిస్తున్న నాగార్జున, బాలయ్యలు 50 ఏళ్ల తర్వాతే ఎక్కువగా సక్సెస్ అయ్యారనేది వాస్తవం.