టాలీవుడ్ ఒకప్పటి సీనియర్ హీరోయిన్ నగ్మా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు.. 90వ దశకంలో ఈమె పేరు చెబితేనే అప్పటి కుర్రాళ్ల ఒళ్ళు పులకరించేది. అరేబియా గుర్రం లాంటి ఈమె అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాంటి నగ్మా టాలీవుడ్ స్టార్ హీరోలో అయన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, వంటి హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. నగ్మా టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఎన్నో సినిమాల్లో నటించింది.
తెలుగులో చివరగా ఆమె యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అల్లరి రాముడు’ సినిమాలో అత్తగా నటించి అలరించింది. ఈమె సినిమాలతోనే కాకుండా ఎఫైర్ వార్తలతోను నగ్మా ఫేమస్ అయింది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తో కూడా ప్రేమాయణం నడిపిందని అప్పట్లో ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. అంతేకాకుండా శరత్ కుమార్, రవి కిషన్ తో కూడా ఆమె ప్రేమాయణం సాగించినట్లు అప్పట్లో రూమర్స్ వచ్చాయి.
ఆ తర్వాత ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కొంత కాలం బిజీగా గడిపిన నగ్మా ప్రస్తుతం ఖాళీగా ఉండటంతో మళ్లీ సినిమాల్లో రిఎంట్రి ఇవ్వడానికి రెడీగా ఉంది. ఈ క్రమంలోనే నగ్మా గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాఘవేంద్రరావు గురించి కొన్ని ఆసక్తికర కామెంట్లు చేసింది. నగ్మా ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు తెలుగు భాష కన్నా తెలుగులో పచ్చి బూతులు బాగా తెలుసు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
దానికి ముఖ్య కారణం దర్శకుడు రాఘవేంద్రరావు అంటూ గతంలో ఆయనతో చేసే సినిమాల్లో తనపై పూలు, పండ్లు తో రొమాంటిక్ సాంగ్స్ ను దర్శకుడు తెరకెక్కించే సమయంలో వాటి అర్ధాలను వివరిస్తూ ఉన్నప్పుడు తనకు ఆ సన్నివేశంలోని పలు బూతు మాటల అర్ధం బాగా తెలియడంతో తనకు కూడా తెలియకుండానే తెలుగు భాషలోని పచ్చి బూతులు తనకు వచ్చాయంటూ షాకింగ్ కామెంట్లు చేసింది సీనియర్ హీరోయిన్ నగ్మా.