ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి అందరికీ తెలిసిందే. చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోల, హీరోయిన్ల జాతకాల గురించి చెబుతూ ఒక్కసారిగా అందరికీ షాక్‌లు ఇస్తూ ఉంటారు. కొందరు క్రేజీ హీరోయిన్లు కూడా వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుంటూ ఉంటారు. ఇప్పటికే ఆయన టాలీవుడ్ లో ఓ యంగ్ హీరో చనిపోతాడని, నాగచైతన్య- సమంత విడాకులు తీసుకుంటారని చెప్పిన మాటలన్నీ నిజమయ్యాయి.
ఆయన చెప్పిన జాతకం కూడా నిజం కావడంతో వేణుస్వామిని చిత్ర పరిశ్రమమేకుండా నెటిజన్లు కూడా నమ్మటం మొదలుపెట్టారు. ఇదే సమయంలో నాగచైతన్య సమంత విడిపోతారని వేణు స్వామి చెప్పినప్పుడు.. వీరిద్దరూ విడిపోయాక చైతు సినిమా కెరీర్ విషయంలో పీక్స్‌కు వెళ్లిపోతారని.. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా నిలుస్తారంటూ చెప్పారు.
అయితే ఇప్పుడు చైతుకు ఆయన చెప్పిన రేంజ్‌లో ఆఫర్లు రావడం లేదు. ఇదే విషయంపై తాజాగా జరగిన ఓ ఇంటర్వ్యూలో వేణుస్వామి క్లారిటీ ఇచ్చారు. 2026లోపు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ చనిపోతారంటూ చెప్పారు. ఈ క్రమంలోనే గతంలో కూడా మీరు నాగచైతన్య విషయంలో విడాకులైన తర్వాత స్టార్ హీరోగా అయిపోతాడు అంటూ సినిమాలు కూడా బాగా చేస్తారంటూ చెప్పినా అలా జరగలేదన్న ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చారు.
వచ్చే జనవరి నుంచి నాగచైతన్య ఎవరూ ఊహించిని విధంగా మారబోతుందని.. ఆయనకు మహర్దశ పట్టుకుందని చెప్పారు. మరి వేణుస్వామి చెప్పిన విధంగా ఈ అక్కినేని హీరో కెరీర్ మారుతుందా లేదా తెలియాలంటే జనవరి వరకు వేచి చూడాల్సిందే..! ఒకవేళ చైతు కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయితే అది ఖచ్చితంగా అక్కినేని ఫ్యాన్స్ కాలర్ ఎగరవేసే న్యూస్ అవుతుంది.