హిట్లు… ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న హీరోల్లో యంగ్ హీరో నాగ శౌర్య ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమా నాగశౌర్యకి మొదటి హిట్ ఇచ్చింది. ఆ తరువాత నాగశౌర్య వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా నాగశౌర్య రంగబలి అనే సినిమాలో చేస్తున్నారు. కొత్త దర్శకుడు ఈ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమా ట్రైలర్ నిన్న రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ తాజాగా మొదలు పెట్టారు. రంగబలి టీం ప్రమోషన్స్ లో భాగంగా సుమ అడ్డా అనే షోలో పాల్గొని సందడి చేసారు. ఈ షో ఇప్పుడు ట్రేండింగ్ అవుతుంది. ఈ షోలో నాగశౌర్య చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాగశౌర్య చందమామ కథలు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. నాగశౌర్యకి ఇచ్చిన సినిమాలు మాత్రం మాత్రం కల్యాణ వైభోగమే, ఛలో,ఊహలు గుసగుసలాడే సినిమాలే. ఆ తరువాత నాగశౌర్య వరుసగా సినిమాలు చేస్తూనే వచ్చారు.
లక్ష్య, లక్ష్మి రావే మా ఇంటికి, కృష్ణ వ్రింద విహారి, అశ్వద్ధామ, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, ఛలో, ఒక మనసు, ఓ బేబీ,అమ్మమ్మగారిల్లు సినిమాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. గత సంవత్సరమే నాగశౌర్య పెళ్లి కూడా చేసుకున్నాడు. ప్రస్తుతం నాగశౌర్య రంగబలి ప్రమోషన్స్ లో బిజీ ఉన్నాడు.
సుమ అడ్డాలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సుమ ఒక ఫోటో చూపించి ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టండి అని అడిగింది. ఆ ఫొటోలో హీరోయిన్ పెదాలు, బుగ్గలు మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే నేను ఆ హీరోయిన్ ఎవరో గుర్తు పడితే నా పెళ్ళాం నన్ను ఇంటికి వెళ్ళాక చితక్కొడుతుంది అంటూ ఆన్సర్ ఇవ్వడంతో అక్కడున్న వాళ్ళందరు నవ్వారు. ఇప్పుడు ఈ ప్రోమో ట్రేండింగ్ అవుతుంది.