త‌న మాజీ భ‌ర్త‌తో రొ…న్స్ చేసింద‌న్న కోపంతో ఆ హీరోయిన్ కెరీర్ నాశ‌నం చేసిన స‌మంత‌..!

నాగచైతన్య – సమంత ఈ పేర్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న మూడు సంవత్సరాలకే విడాకులు తీసుకున్నారు. కాగా ఇప్పటికీ వీరిద్దరి వార్తలు బయటకి వస్తే చాలు.. ఆ వార్త ఏంటో తెలుసుకునేందుకు సినీ అభిమానులు, నెటిజ‌న్లు ఎంతో ఆస‌క్తి చూపుతూనే ఉంటారు.

ప్రస్తుతం అలాంటి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాగచైతన్య – సమంత కాంబినేషన్లో ఇప్పటికే ఏ మాయ చేసావే, మజిలీ, ఆటోనగర్ సూర్య, మనం సినిమాలు తెరకెక్కయి. వీటన్నింటిలో క్యూటెస్ట్ లవ్ స్టోరీ అంటే మనకు గుర్తుకు వచ్చేది ఏ మాయ చేసావే, మజిలీ సినిమాలు. మజిలీ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమాలో నాగచైతన్య లవర్ గా దివ్యాన్షా కౌశిక్ నటించింది. ఈ సినిమాలో కౌశిక్ – చైత‌న్య‌ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారు.

ఆ త‌ర్వాత దివ్యాన్ష్.. చైతన్యకి దూరమైపోతుంది. తర్వాత సమంత – నాగచైతన్యను పెళ్లి చేసుకుంటుంది. సమంత మొదట్లో వన్ సైడ్ గా నాగచైతన్య‌ని లవ్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత చైతన్య కూడా సమంతని ప్రేమించడం మొదలుపెడతాడు. ఇందులో దివ్యాంశా కౌశిక్, నాగచైతన్య లవర్స్ గా ఉన్న టైంలో వారిద్దరి మధ్య కొన్ని రొమాంటిక్ సీన్లు ఉన్నాయట. అప్పుడు భ‌ర్త‌తో ఉన్న స‌మంత ఆ సీన్స్ తెరపైకి రాకుండా అడ్డుకుందట‌.

అందులో రొమాన్స్ ఎక్కువగా ఉంద‌ని చెప్పి ఆ సీన్స్ కట్ చేయించిందని.. వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సీన్స్ కట్ చేయడం వల్ల మజిలీ సినిమాతో దివ్యాంశా కౌశిక్ కి అంతగా గుర్తింపు రాలేదని.. కేవలం సినిమా పేరు చెప్తే నాగచైతన్య – సమంత పేర్లు మాత్రమే గుర్తుకు వచ్చేలా చేసిందని అప్ప‌ట్లో రూమ‌ర్లు వినిపించాయి.

ఆ తర్వాత దివ్యాంశా కౌశిక్ ర‌వితేజ‌ రామారావు ఆన్ డ్యూటీ, నితిన్ టక్కర్ సినిమాల్లో అవకాశాలు వచ్చినా సక్సెస్ కాలేకపోయిందని.. ఇలా సమంత పరోక్షంగా చైతన్యతో రొమాన్స్ సీన్స్ కట్ చేయించి దివ్యాన్ష్ కౌ
శిక్ కెరియర్ నాశనం అవ్వడానికి కారణమైంద‌న్న ప్ర‌చారం అప్ప‌ట్లో వినిపించింది.