టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల ‘ ఖుషి ‘, ‘ సిటడెల్ ‘ సినిమా షూటింగ్స్ పూర్తి చేసి సినిమాలకు గ్యాప్ తీసుకుంది. ఏడాది పాటు సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్న సమంత అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోబోతుందంటూ వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం సమంత లైఫ్ ని ఎంజాయ్ చేస్తే పనిలో ఉంది.
ఓ పక్క ఆధ్యాత్మిక బాటలో ప్రయాణిస్తూనే మరోపక్క ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తూ ఎప్పటికప్పుడు తన ఫోటోలను వెకేషన్ ఎక్స్పీరియన్స్‌ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటుంది. ఇటీవల సమంత తన ఇన్స్టా స్టోరీలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పంచుకుంది. కొన్నిసార్లు మీరు ద్వేషం గురించి వింటూ ఉంటారు.. కానీ ఈ ప్రపంచంలో మీరు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ప్రేమ ఉంది అంటూ అందులో రాసుకుంది.
పెద్ద హార్ట్ సింబల్ తో ఈ మెసేజ్ షేర్ చేసింది. ప్రస్తుతం పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇది సమంత ఎవరిని ? ఉద్దేశించి పెట్టిందో గాని నూటికి నూరుపాళ్ళు నిజం చెప్పింది అంటూ.. మరి కొంతమంది సమంత మళ్ళీ ప్రేమలో పడి ఉంటుందా? అంటూ.. ఇంకొంతమంది ఇది నాగచైతన్యను ఉద్దేశించే సమంత పెట్టింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.