టాలీవుడ్ లో నాగార్జున-టబూ కాంబినేషన్ విజయవంతమైన వాటిల్లో ఒకటి. వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’ సినిమాలు వచ్చాయి. 1996లో వచ్చిన ‘నిన్నే పెళ్లాడతా’ అయితే సూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ కూడా బాగా పండింది. దాంతో వీరిద్ధరి మధ్య ఏదో ఉందంటూ రూమర్లు కూడా వచ్చాయి. చాలా కాలం పాటు వీరు రిలేషన్ షిప్ లో ఉన్నారనే వార్తలు కూడా వ్యాపించాయి.
టబూ తనకు మంచి ఫ్రెండ్ అంటూ నాగార్జున గతంలో ఈ రూమర్లను ఖండించారు. ఇక ఇప్పుడు రిలేషన్ పై నాగచైతన్య కూడా స్పందించారు. రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ చిత్ర పరిశ్రమ నుంచి మా కుటుంబానికి దగ్గరైన వారిలో హీరోయిన్ టబు కూడా ఒకరు.. మా అక్కినేని కుటుంబం మొత్తానికి ఆమె నా చిన్నతనం నుంచి ఎంతో క్లోజ్ గా ఉండేవారని చెప్పాడు. చిత్ర పరిశ్రమకు చెందిన వారిలా కాకుండా మా సొంత కుటుంబ సభ్యులలో ఒకరిగా టబూ మాతో కలిసి ఉండేదని చైతు తెలిపాడు.
ఇప్పటికీ కూడా ఏదైనా పండగల సమయంలో మా అందరికీ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతూ ఉంటారు టబు. అదే సమయంలో హైదరాబాద్‌కు వచ్చినప్పుడల్లా మా తండ్రి నాగార్జున గారిని మమ్మల్ని ఎప్పుడూ కలుస్తూనే ఉంటుంది అంటూ నాగచైతన్య ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు నాగచైతన్య చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాగార్జున.. టబుకి మధ్య అప్పట్లో నిజంగానే ప్రేమ నడిచిందా? వీరిద్దరూ మంచి స్నేహితుల మాదిరిగానే ఉన్నారా? అనేది ఇప్పటికీ ఓ అంతు చిక్కని ప్రశ్నల మిగిలిపోయింది.
ఇక ఇప్పుడు నాగచైతన్య చెప్పిన విషయాలనే గతంలో కూడా నాగార్జున భార్య అమల కూడా ఓ ఇంటర్వ్యూ లోని చెప్పుకొచ్చింది. టబూ హైదరాబాద్ వచ్చినప్పుడు తమ ఇంట్లోనే ఉంటుందని కూడా చెప్పారు. ఇక ఇప్పుడూ నాగచైతన్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.