విలక్షణ నటుడు మోహన్ బాబు కెరీర్‌లో ఎదిగిన తీరు చాలామందికి ఎంతో ఆదర్శంగా ఉంటుంది. హీరో కావాలని చెన్నై వెళ్లిన మోహన్ బాబు అవకాశాల కోసం కాళ్లు అరిగేలా సినిమా ఆఫీసులో చుట్టూ తిరిగేవారు . అన్నం లేక ఖాళీ కడుపుతో ఉండేవారు. విలన్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో స్థాయికీ ఎదిగాడు. వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో కలెక్షన్ కింగ్ అనే బిరుదును అందుకున్నాడు. ఇలా ఒక్కో మెట్టు ఎక్కే సమయంలోనే కొన్ని విషాదాలు ఆయన జీవితంలో ఎదురయ్యాయి. వాటిలో ముఖ్యమైనది అయిన మొదటి భార్య మరణం. మోహన్ బాబు మొదటి భార్య విద్యాదేవి ఆత్మహత్య చేసుకుని మరణించారు.
ఇక మోహన్ బాబు తన మొదటి భార్య ఆత్మహత్యకు కారణం ఏమిటో పలు సందర్భాల్లో కూడా చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో ఎదిగే సమయంలోనే మోహన్ బాబు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత భార్య విద్యా దేవితో కలిసి చెన్నైలో కాపురం పెట్టారు. అడపాదడపా అవకాశాలు చాలీచాలని సంపాదనతో మోహన్ బాబు దంపతులు ఎన్నో ఇబ్బందులు పడేవారట. ఓ రోజు వారు ఉంటున్న ఇంటికి అద్దె చెల్లించలేదని.. ఆ ఇంటి యజమాని వారి సామాన్లను బయటికి విసిరేసి వారి తిని భోజనంలో మూత్రం పోసాడట. అప్పుడు ఇంటికి వెళ్లి మోహన్ బాబు- విద్యాదేవి ఆ పని చూడలేక ఎంతో బాదపడ్డారట.
ఆ కసితో నటుడుగా ఎదగాని మోహన్ బాబు మరింత కష్టపడే వారు . ఎక్కువ సినిమాలు నటించే క్రమంలో సరిగా ఇంటికి వచ్చేవాడు కాదట . ఆ సమయంలోనే తన భార్య పిల్లలను కూడా అసలు పట్టించుకునే వారు కాదట. మోహన్ బాబు భార్య విద్యాదేవిని పట్టించుకోవడంలేదనే కోపం అసహనంతో ఆమె ఒక రోజు ఆవేశంలో ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటికి మంచు లక్ష్మి, విష్ణు చిన్న పిల్లలు విద్యాదేవి మరణంతో పిల్లలు అనాధలు అవుతారని మోహన్ బాబుకు నచ్చజెప్పి దాసరి నారాయణరావు రెండో వివాహం చేశారట.
బయటినుంచి వచ్చిన అమ్మాయి అయితే పిల్లల్ని సరిగ్గా చూసుకుంటుందో లేదో అన్న భయంతో విద్యాదేవి చెల్లిని నిర్మల దేవినే మోహన్ బాబు రెండో వివాహం చేసుకున్నారు . ఇక నిర్మలాదేవికి మంచు మనోజ్ పెట్టాడు. మొదట చాలా కోపంగా ఉండే మోహన్ బాబు నిర్మలాదేవిని వివాహం చేసుకున్న అనంతరం ఆ కోపం మెల్లిమెల్లిగా తగ్గింది. ఇప్పటికీ ఏ విషయమైనా ఖరాఖండీగా చెప్పేసే తత్వం మాత్రం మానలేదు.