ప్రభాస్ ‘ కల్కి – 2898 AD ‘ లో అతి పెద్ద స‌స్పెన్స్ అలాగే వ‌దిలేశారుగా ( వీడియో )

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో స‌లార్‌, ప్రాజెక్ట్ కే పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తన వరల్డ్ క్లాస్ భారీ చిత్రం “ ప్రాజెక్ట్ కె ” నుంచి టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ప్రాజెక్ట్ కే అంటే ఏంట‌న్న‌దానిపై ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద స‌స్పెన్స్ ఉండేది. చాలా పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

ప్రాజెక్ట్ కాల‌చ‌క్ర‌, ప్రాజెక్ట్ క‌ల్కి అని ర‌క‌ర‌కాల పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు టైటిల్‌ సహా ఫస్ట్ గ్లింప్స్ మేకర్స్ రివీల్ చేశారు. ప్రాజెక్ట్ కే సినిమా “కల్కి” గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఇక గ్లింప్స్‌లో స్టన్నింగ్ విజువల్స్ తో మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. మ‌నం ఖ‌చ్చితంగా మ‌రో ప్ర‌పంచంలోకి వెళ్లిపోయిన‌ట్టుగా ఉంది.

యాక్ష‌న్ అయితే క‌ళ్లు చెదిరిపోయేలా ఉంది. అయితే ఈ సినిమా ను గ‌త కొద్ది రోజులుగా వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జనవరి 12న వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ గ్లింప్స్‌ వీడియోలో మాత్రం రిలీజ్ డేట్ పెద్ద‌ సస్పెన్స్ గానే ఉంచారు. అలాగే ప్రాజెక్ట్ కే బ‌డ్జెట్ పెరిగిపోవ‌డంతో రెండు పార్టులుగా రిలీజ్ చేస్తార‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది.

ఆ స‌స్సెన్స్ కూడా ఈ వీడియోలో రివీల్ చేయ‌కుండా అలాగే ఉంచేశారు. దీంతో ఈ సినిమా వ‌చ్చే సంక్రాంతికి వ‌స్తుందా ? రాదా ? అన్న స‌స్పెన్స్ అయితే అలాగే ఉంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కూడా ఆల‌స్యం అయ్యే అవ‌కాశాలు ఉండ‌డంతో ఈ సినిమాను మే 9న రిలీజ్ చేసే ఆలోచ‌న కూడా మేక‌ర్స్ చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది.