మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాతో బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుని వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇక ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ చేస్తున్న చిరంజీవి ఆ తర్వాత కురసాల కళ్యాణ్ దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పాడు. ఇక భోళాశంకర్ తమిళ వేదాళం సినిమాకు రీమేక్‌గా వస్తోంది. రీసెంట్ గానే ఈ సినిమా టీజర్ కూడా ప్రేక్షకు ముందుకు వచ్చింది.
ఈ టీజర్ మరీ అంత కొత్తగా లేదని.. రొటీన్ స్టైల్లోనే ఉందంటున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జంటగా మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తుంది. అంతేకాకుండా కీర్తి సురేష్ కూడా చిరుకు చెల్లి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా టీజర్లో కొన్ని విషయాలు గమనిస్తే.. చిరంజీవి, ఎన్టీఆర్ సినిమాను కాపీ కొడుతున్నారా ? అని అనక మానరు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన రామయ్య వస్తావయ్య సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పింక్ కలర్ షర్ట్ పై నీలం గళ్ళు ఉన్న షర్ట్ వేసుకుంటారు కదా ? ఇక ఇప్పుడు ఇదే షర్ట్ చిరంజీవి వేసుకొని భోళా శంకర్ టీజర్ లో కనిపించాడు. అలాగే బ్లాక్ అండ్ వైట్ కలర్ చొక్కా కూడా ఎన్టీఆర్ కాస్ట్యూమ్స్‌ని పోలి ఉంటుంది.
ఈ విషయంపై నెటిజన్లు సోషల్ మీడియాలో చిరంజీవిని ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. ఎన్టీఆర్ స్టైల్‌ని చిరుతో కాపీ కొట్టించావా అంటూ దర్శకుడు మెహర్ రమేష్‌ను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా అరవింద సమేతలో వచ్చే కుర్చి ఫైట్ కూడా ఇప్పుడు భోళాశంకర్ టీజర్లో డిటో దించేశారు. ఇలా ఎన్టీఆర్ సినిమాలను కాపీ కొట్టి భోళాశంకర్ సినిమా వస్తుందంటూ సోషల్ మీడియాలో మీమ్స్ కూడా తెగ హల్చల్ చేస్తున్నాయి.
టీజర్లోనే ఈ స్థాయిలో కాపీ కొట్టిన మెహర్ రమేష్. ఇక మరి సినిమాలో ఏ స్థాయిలో తన దర్శకత్వ ప్రతిభ చూపిస్తాడో చూడాలి. ఇక మెహర్ రమేష్ డైరెక్షన్‌పై ముందు నుంచి ఎవ్వరికి నమ్మకాలు లేవు. ఇప్పుడు టీజర్ కూడా ఆసక్తిగా లేకపోవడంతో చిరు పని భోళాశంకర్‌తో పాయేనా ? అన్న డౌట్లు రైజ్ అయిపోయాయి.