టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఎలాంటి ? క్రేజ్ ఉందో తెలిసింది ఈ ఫ్యామిలీ నుంచి చిరంజీవి తర్వాత ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఒక క్రికెట్ టీంలో 11 మంది హీరోలు వచ్చేశారు. ఒక ఏడాదిలో సగటున నెలకు ఒక మెగా హీరో సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది అంటే మెగా ఫ్యామిలీ హవర్ ఎలా ?నడుస్తుందో అర్థం అవుతుంది.
మెగా ఫ్యామిలీకి సినిమాలపరంగా ఎంత గొప్ప క్రేజీ ఉన్నా మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు కుమార్తెల వైవాహిక జీవితంలో మాత్రం వారికి ఏమాత్రం మనశ్శాంతి లేకుండా పోతుంది. చిరంజీవి పెద్ద కుమార్తె కొణిదెల సుష్మితకు పెళ్ళికి ముందే ఒక ఎంగేజ్మెంట్ జరిగాక బ్రేకప్ అయ్యింది. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకున్న భర్తతో అంత సఖ్యత లేదని దూరం దూరంగా ఉంటుందని అంటున్నారు. ఆమె హైదరాబాద్ తండ్రి ఇంటికి వచ్చేసి 10 ఏళ్లు దాటుతోంది.
ఇక చిరు రెండో కుమార్తె శ్రీజకు చిరంజీవి మేనల్లుడు ప్రస్తుత టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్తో పెళ్లి జరగాల్సి ఉందట. బన్నీ 2003లో గంగోత్రి సినిమాతో హీరో అయ్యాడు. అల్లు అరవింద్, చిరంజీవి బావ బావమరుదుల కంటే గొప్ప స్నేహితుల్లా కలిసిమెలిసి ఉండేవారు. చిరంజీవి స్టార్ హీరో అవటంలో అల్లు అరవింద్ కీలకపాత్ర పోషించారు. ఈ క్రమంలోనే ఈ బావ బావమరుదులు వియ్యంకులు కూడా అవ్వాలని అనుకున్నారట.
ఒకవేళ అల్లు అర్జున్ కు కాకపోయినా అల్లు శిరీష్ కు అయినా శ్రీజను ఇచ్చి పెళ్లి చేయాలని ఇరువైపులా చిన్నప్పటినుంచే చర్చలు ఉన్నాయట. అయితే శ్రీజ ఇంట్లో వాళ్లకు తెలియకుండా 2008లోనే శిరీష్ భరద్వాజను ప్రేమ వివాహం చేసుకొని బయటికి వెళ్లిపోయింది. నిజంగా శ్రీజ అలాంటి పని చేస్తుందని చిరంజీవి ఊహించలేదు. ఒకవేళ శ్రీజ అలా చేసి ఉండకపోతే కచ్చితంగా ఆమె అల్లు అర్జున్ లేదా అల్లు శిరీష్ కు భార్య అయ్యి ఉండేదట.
అలా అల్లు అరవింద్, చిరంజీవి వియ్యంకులు అయ్యే వారిని ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ గురించి బాగా తెలిసిన సన్నిహితులు అప్పుడప్పుడు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. దురదృష్టం ఏంటంటే శ్రీజ తొలి వివాహ బంధం విచ్ఛిన్నమైంది. ఇక చిరంజీవి పట్టుబట్టి కళ్యాణ్దేవ్తో రెండో పెళ్లి చేసిన అది కూడా దాదాపు విడాకుల వరకు వచ్చేసిన సంగతి తెలిసిందే