మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ ట్రైలర్ డేట్ వచ్చేసింది..!!

టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఎన్నో దశాబ్దాలు అవుతున్నప్పటికీ ఇంకా టాలీవుడ్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు చిరంజీవి. యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాల్లో నటించి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ప్రస్తుతం మెహర్ రమేష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘ భోళా శంకర్ ‘ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు చిరంజీవి. ఈ సినిమా తమిళ్ మూవీ ‘ వేదాళం ‘ కి రీమేక్ గా వస్తుంది. ఇటీవల కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందిన ‘ ఆచార్య ‘ సినిమాతో ఫ్లాప్ ను చెవి చూసిన చిరంజీవి.

భోళా శంకర్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఉద్దేశంతో ఉన్నాడు. తమన్నా హీరోయిన్గా, కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల అంచనాలు పెరిగాయి. కాగా ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను మెప్పించినా.. తర్వత వచ్చిన సాంగ్స్ మాత్రం ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఈ పాటలలో చిరంజీవి స్టైలిష్ గా ఉన్న.. పాటలు బాగున్నా మ్యూజిక్ పరంగా ప్రేక్షకులు సాంగ్స్ కి కనెక్ట్ కాలేదు. దీంతో ఈ సినిమాపై హైప్ తగ్గిందనే చెప్పాలి. ఇక జులై 27వ తేదీన ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నట్టు మూవీ టీం ప్రకటించారు.

ట్రైలర్ తో అయినా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతారో లేదో చూడాలి. ఇక ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ పైనే అసలు పెట్టుకున్నారు చిరంజీవి ఫ్యాన్స్. ఎలాగైనా చిరంజీవి ఈ సినిమాతో హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు. ఇక ఈ సినిమా తరువాత చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత, భర్త విష్ణు ప్రసాద్ ఓన్ ప్రొడక్షన్ లో గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో మరో సినిమాలో చిరంజీవి నటించబొతున్నాడు. ఇది గోల్డ్ బాక్స్ ఎంటర్టైర్మెంట్ బ్యనర్ ఫస్ట్ సినిమా కావడం విశేషం.