మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. చిరంజీవి తన తనయుడు రామ్ చరణ్‌తో కలిసి ఇప్పటికే మగధీర, బ్రూస్ లీ, ఖైదీ నెంబర్ 150, ఆచార్య వంటి సినిమాల్లో కలిసి నటించారు. వాటిలో మగధీర, బ్రూస్లీ సినిమాలో రామ్ చరణ్ హీరో అయితే.. చిరంజీవి గెస్ట్అ పీరియన్స్ గా వచ్చాడు.. అలాగే చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 లో రామ్ చరణ్ అమ్మడు కుమ్ముడు పాటలో చిరుతో పాటు డాన్స్ వేశాడు.
గతి ఏడాది వచ్చిన ఆచార్య సినిమాలో చిరు- రామ్‌చరణ్ కలిసినటించిన కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అలాగే చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ తోనే కాకుండా తన తమ్ముళ్లు అయిన పవన్ కళ్యాణ్, నాగబాబు, బామ్మర్ది అల్లు అరవింద్, అలాగే మేనల్లుడు అల్లు అర్జున్‌తో కూడా కలిసి నటించాడు. ఇలా ఇంతమంది తన కుటుంబ సభ్యులతో కలిసి నటించిన చిరంజీవి తన తండ్రి కొణిదల వెంకట్రావుతో కూడా ఓ సినిమాలో నటించారు.
అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు. చిరంజీవి హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాక సీనియర్ దర్శకుడు బాపు దర్శకత్వంలో వచ్చిన మంత్రిగారు వియ్యంకుడు సినిమాలో చిరంజీవి తండ్రి వెంకట్రావుతో కూడా నటించాడు. ఈ సినిమాలో దర్శకుడు బాపు గారు మంత్రిగారి క్యారెక్టర్ కోసం వెతుకుతూ ఉంటే అల్లు రామలింగయ్య గారు చిరంజీవి తండ్రి వెంకట్రావు పేరును బాపు గారికి చెప్పారట.
ఈ సినిమాలో చిరంజీవికి ఆయన తండ్రిగారైన వెంకట్రావుకి ఎలాంటి డైలాగులు కూడా లేవు. కనీసం తెరపై ఎదురు కలిసి కనిపించరు. కానీ తన పెద్ద కొడుకు చిరంజీవి నటించిన ఓ సినిమాలో యాక్ట్ చేసిన సంతృప్తి మాత్రం వెంకట్రావు గారికిి మిగిలింది.