ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు అర్జున్. ఎన్నో సినిమాల్లో హీరోగా నటిస్తూనే స్టార్ హీరోయిన్లకు అన్న పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అర్జున్ కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించినా ఒకే ఒక్కడు సినిమాతో ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నాడు అర్జున్. అతడి కెరీర్ లోనే ది బిగెస్ట్ హిట్‌గా ఈ సినిమా నిలిచిపోయింది. ఈ సినిమాకు కోలీవుడ్ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించారు.
మొదట రిపోర్టర్ గా ఉన్న అర్జున్ ఒకరోజు సీఎం పదవిని ఛాలెంజ్‌ని తీసుకొని తన బాధ్యతలను నిర్వర్తిస్తాడు. ప్రజలకు అతడి పాలన నచ్చడంతో తర్వాత సీఎంగా మారతాడు. కేవలం తమిళ్‌లోనే కాకుండా అన్ని భాషల్లోనూ రిలీజై బాక్సాఫీస్ వద్ద ఆ రోజుల్లోనే రూ. 30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను వసూళ్లు చేసింది. ఈ సినిమాలో మొదటిగా తమిళ్‌లో అర్జున్ తో.. తెలుగులో చిరంజీవితో రూపొందించాలి అనుకున్నాడట డైరెక్టర్ శంకర్.
కథను చిరంజీవికి వినిపించగా ఈ సినిమా చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట. కానీ సినిమా షూటింగ్ టైంకి కాల్ షీట్లు ఎడ్జస్ట్ చేయలేక చిరంజీవి ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. దీంతో తెలుగులో కూడా అర్జున్‌తో చేసిన సినిమాను డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఒకవేళ చిరంజీవి ఈ సినిమాలో నటించి ఉంటే మరింత బ్లాక్ బస్టర్ హిట్టై ఉండేదని శంకర్ అభిప్రాయపడ్డాడట
అర్జున్ ఈ సినిమాలో నటించినా సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో పాటు 20 ఏళ్ల పాటు అర్జున్ కెరీర్‌కు తిరుగులేకుండా పోయింది. ఈ సినిమాను హిందీలో కూడా అనిల్ కపూర్ హీరోగా పెట్టి నాయక్ పేరుతో తెరకెక్కించారు. ఈ సినిమా బాలీవుడ్ వద్ద బోల్తా పడింది. హిందీ ప్రేక్షకులు ఈ సినిమాకు కనెక్ట్ అవ్వలేకపోయారు దీంతో సినిమా బాలీవుడ్ లో డిజాస్టర్ గా నిలిచింది.