kj సినిమాలకు వారు పెట్టుకున్న సెంటిమెంట్లు ఎలా ఫాలో అవుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ లిస్టులోకి యాడ్ అయిపోయాడు మెగాస్టార్ చిరంజీవి కూడా..! చిరంజీవి తన కెరీర్ లో ఎప్పుడు ఇలాంటి సెంటిమెంట్లు పెద్దగా ఫాలో అవ్వడు.
తన సినిమాల రిలీజ్ విషయంలో కూడా ఎప్పుడు ఫాలో అవ్వడు. కథ నచ్చితే సినిమా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం చిరంజీవి పూర్తిగా సెంటిమెంట్ ఫాలో అవుతూ సినిమాలు చేస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమా తర్వాత ..సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించిన చిరంజీవి .. ఆ తర్వాత నుంచి తాను చేసే సినిమాలలో మరో హీరోని పెట్టుకోవడం అలవాటుగా చేసుకున్నాడు.
మరీ ముఖ్యంగా యంగ్ హీరోలపై చిరంజీవి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమాలో సత్యదేవ్ తో కలిసి నటించిన మెగాస్టార్.. ఈ సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య లో రవితేజ తో కలిసి నటించి సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం మెహర్ రమేష్తో చేస్తోన్న భోళా శంకర్ సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కూడా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నాడు చిరంజీవి.
ఆ సినిమాలోను ఇద్దరు యంగ్ హీరోలతో కలిసి చిరు నటించబోతున్నారు. అందులో సిద్దు జొన్నలగడ్డ ఒకరు మరొకరు కార్తికేయ.ఆ తర్వాత బింబిసార దర్శకుడు వశిష్టతో చేసే సినిమాలో కూడా చిరంజీవితో పాటు మరో ఇతర హీరోలు నటించబోతున్నారనిని తెలుస్తుంది. ఈ విధంగా చిరంజీవి తాను చేసే ప్రతి సినిమాలోను యంగ్ హీరో నటించడం సెంటిమెంట్ గా భావిస్తున్నారు అంటూ మెగా ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు…!