చిరంజీవి భోళా శంకర్ సినిమా షూటింగ్ పూర్తయింది. షూటింగ్ జరిగినన్ని రోజులు చిరంజీవి చాలా ఉత్సాహంగా గడిపారు. ఇప్పటికే ఆ సినిమా నుంచి మేకింగ్ వీడియోలు చాలా వచ్చాయి. అందులో చిరంజీవి జోష్ బాగా కనిపించింది. తాజాగా సెట్స్ లో జరిగిన మరో సరదా సంఘటన బయటకు వచ్చింది. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటించింది.
సెట్స్ లో తమన్నాను చిరంజీవి ఏ తమన్ అని పిలిచేవారట. తమన్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అలా భోళాశంకర్ షూటింగ్ జరిగినన్ని రోజులు తమన్ పేరు వినిపించేది అని చెప్పుకొచ్చింది తమన్నా. తమన్ ఎవరు పిలిచినా నన్ను పిలిచినట్టు అనిపిస్తుంది.. ఆయన పేరు నా పేరు దాదాపు ఒకేలా ఉన్నాయి. షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా చిరంజీవి నన్ను తమన్ అని పిలిచేవారు.. అలా మా సెట్స్ లో ఎప్పుడూ తమన్ పేరు వినిపించేది అని తమన్నా తెలిపింది.
ఇక దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ చిరంజీవి ఎప్పుడు తమన్ అని పిలిచినా.. ఆయన సెట్‌లోకి వచ్చాడేమో అని తాను అటువైపు చూసేవాడిని అంటూ.. తీరా అక్కడ చూస్తే తమన్నా ఉండేదని తెలిపారు
ఇక తమన్నాకు చిరంజీవి భలే ముద్దు పేరు పెట్టారు అంటూ నెటిజన్లు తమన్నాను సరదాగా ఆట పట్టిస్తున్నారు.
చిరు మీరు మొత్తానికి తమన్నాకు ఒక అబ్బాయి పేరు పెట్టారు.. తమన్నాను అలా మగాడిగా మార్చేశారు అంటూ సరదాగా జోకులు పేలుస్తున్నారు. ఇక తనకు మిల్కీబ్యూటీ అని ట్యాగ్‌లైన్ ఎలా ? వచ్చిందో ఇప్పటికీ అర్థం కాదని.. కేవలం తన కలర్ చూసి ఆ బిరుదు ఇవ్వలేదు.. తనపై ఉన్న ప్రేమతో తెలుగు ప్రేక్షకులు అలా చూపించారని తన అభిప్రాయం వ్యక్తం చేసింది.