మెగా ప్రిన్సెస్ ‘ క్లీంకార ‘ పేరులో ఇంత గొప్ప అర్థం ఉందా… చిరు చెప్పిన మాట‌ల‌కు హ్యాట్సాఫ్‌..!

మెగా కోడలు ఉపాసన ఇటీవల ఒక ఆడపిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఉపాసన రామ్‌చరణ్ ముద్దుల కూతురు బారసాల వేడుకలు ఘనంగా జరిగాయి. మెగా ప్రిన్సెస్ కు క్లీంకార అనే పేరును పెట్టినట్టు పాప త‌ల్లి తండ్రులు రామ్‌చరణ్ – ఉపాసన దంపతులు ట్విట్టర్ ద్వారా అనౌన్స్‌ చేశారు.

మెగా ప్రిన్సెస్ తాత చిరంజీవి బారసాల పూర్తయిన తర్వాత ట్విట‌ర్ వేదిక‌గా ఉపాసన – రామ్ చరణ్ తల్లిదండ్రులతో కలిసి పాపను ఉయ్యాలలో వేసి దిగిన ఫోటో షేర్ చేశాడు. దీంతో పాటు చెంచు గిరిజన దేవత భావమ్మ దేవి దీవెనలతో మేము మా ముద్దుల మనవరాలుకి క్లీంకార‌ అని పేరు పెట్టామంటూ ఓ నోట్ షేర్ చేశాడు చిరంజీవి.

మెగా ప్రిన్సెస్ పేరుకి గల అర్థాన్ని ప్రాముఖ్యతను కూడా ఆ నోట్‌లో వివరించాడు. ఆ నోట్ పై చరణ్ అమ్మా నాన్న చిరంజీవి – సురేఖ ఉపాసన తల్లిదండ్రులు అనిల్ – శోభన సంతకాలు ఉన్నాయి. మెగా ప్రిన్సెస్ పేరుని లలిత సహస్రనామాల నుంచి తీశామని.. క్లీంకారా అంటే ప్రకృతి మాత స్వరూపం, ఆదిశక్తి ఆశీస్సులు ఆ పేరులో ఉంటాయని… ఆ పేరులో పవర్ఫుల్ వైబ్రేషన్స్ ఉన్నాయని ట్విట్టర్లో పేర్కొన్నాడు చిరంజీవి.

నా మనవరాలు పెద్ద అయిన‌కొద్ది ఆ స్వభావాలను తనలో ఇముడ్చుకుంటుంద‌ని కోరుకుంటున్నాను అని ట్విట్ చేశాడు. ఏదేమైనా గ‌త కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీలో పుట్టే బిడ్డ ఎవ‌రు ? అన్న ఉత్కంఠ నెల‌కొంది. మెగా ఆడ‌ప‌డుచు జ‌న్మించ‌గా.. ఆ పాప‌కు పెట్టిన పేరు కూడా ఇప్పుడు బాగా హైలెట్ అవుతోంది.