సాయిధ‌ర‌మ్ తేజ్ హెల్త్‌కు ఏమైంది… ‘ బ్రో ‘ సాంగ్‌లో ఈ మార్పు చూశారా..!

మెగా మేన‌ళ్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ కెరీర్ చ‌క్క‌గా సాగుతోన్న టైంలో జ‌రిగిన యాక్సిడెంట్ మ‌నోడికి చాలా ఇబ్బందిగా మారింది. నిజం చెప్పాలంటే సాయి ప్రాణ‌పాయ అంచుల వ‌ర‌కు వెళ్లి మ‌రి బ‌తికాడు. ఇది అత‌డికి పున‌ర్జ‌న్మ లాంటిదే. ఇక మెగా హీరోల్లో కొందరికి భారీ శరీరం అన్న‌ది ఓ స‌మ‌స్య‌. అది జీన్స్ వల్ల వచ్చిందే.. అయితే వారు అశ్రద్ద చేస్తే లావుగా అయిపోతారు.

నాగ‌బాబు, చిరంజీవి ప‌ర్స‌నాలిటీలే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. అయితే ప‌వ‌న్ మాత్రం ఇందుకు మిన‌హాయింపు. ప‌వ‌న్ వ‌య‌స్సు పెరిగినా అస్స‌లు బాడీ మార‌లేదు. బాడీ షేఫ్ పై నుంచి కింద‌కు ఒకేలా ఉంటుంది. పై నుంచి కింత‌కు పెద్ద హెచ్చు త‌గ్గులు ఉండ‌వు. ఇక ఆ త‌ర్వాత జ‌న‌రేష‌న్లో రామ్‌చ‌ర‌ణ్ పొట్టిగా ఉన్నా వ‌ర్క‌వుట్లు చేస్తూ పెద్ద ఎబ్బెట్టుగా అయితే ఉండ‌డు.

ఇక వరుణ్ తేజ్ పొడవుగా వుండడంతో ఇబ్బంది లేదు. ఇక ఎటు చూసినా సాయి ధరమ్ తేజ్ ఏమాత్రం అశ్రద్ధ చేసినా లావు అయిన‌ట్టుగా క‌నిపించేస్తున్నాడు. ఇక యాక్సిడెంట్ త‌ర్వాత సాయి రూపంలో మ‌రిన్ని మార్పులు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. తాజాగా వ‌చ్చిన బ్రో సినిమా సాంగ్‌లో సాయిధ‌ర‌మ్ క‌న్నా ప‌వ‌నే ఫిట్‌గా ఉన్నాడు.

ఇక యాక్సిడెంట్ త‌ర్వాత సాయి వ‌ర్క‌వుట్లు మ‌రీ ఎక్కువుగా చేయ‌లేక‌పోతున్నాడంటున్నారు. అందుకే ఈ లావు స‌మ‌స్య బాగా వేధిస్తున్న‌ట్టుగా క‌న‌ప‌డుతోంది. విప‌రీతంగా మందులు వాడ‌డంతో ఆ ఎఫెక్ట్ కూడా స్ప‌ష్టంగా ప‌డింది. సాయి చివ‌రి సినిమా విరూపాక్ష తో పోల్చుకుంటే బ్రో సాంగ్ లో కొంచెం లావుగానే వున్నారు.

ఏదేమైనా సాయిధ‌ర‌మ్ తేజ్ భ‌విష్య‌త్తులో స్లిమ్‌గా క‌న‌ప‌డాల‌న్నా… మ‌రీ ఎబ్బెట్టుగా లేకుండా ఉండాల‌న్నా యోగా లేదా ఏ కేరళ వైద్యం లాంటి ఆల్టర్ నేటివ్ వైద్యం ఆశ్ర‌యించ‌డం మేల‌ని చెపుతున్నారు.