మెగా ఫ్యామిలీలోకి కొత్త మెంబ‌ర్ వ‌చ్చేశాడు… ఊరించి ఉసూరుమ‌నిపించిన చెర్రీ, ఉపాస‌న‌..!

మెగా అభిమానులు గత పది సంవత్సరాలుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ రానేే వచ్చింది. మెగా కోడలు ఉపాసన పండంటి బిడ్డకు జన్మనిచ్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు అనే విష‌యం ఇప్పటికే మనందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని గత సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన అఫీషియల్ గా మెగా ఫ్యామిలీ ప్రకటించింది.

 

అప్పటినుంచి ఉపాసన గురించి వ‌చ్చే ప్రతి వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది. నిన్న రాత్రి అపోలో హాస్ప‌ట‌ల్లో జాయిన్ అయిన ఉపాసన ఈరోజు ఉదయం ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి పిల్ల కూడా క్షేమంగా ఉన్నటు డాక్టర్లు ప్రకటించారు. ఈ జంటకు మంగళవారం తెల్లవారుఝామున అంటే ఈ ఈరోజు ఆడబిడ్డ పుట్టినట్లు జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ మెడికల్ బులిటెన్ ద్వారా ప్రకటించింది.

Ram Charan and Upasana at Apollo hospital for sai dharam tej | Ram Charan and Upasana at Apollo hospital for sai dharam tej | Tupaki Telugu

కొణిదెల- కామినేని కుటుంబాలు ఆనందంలో మునిగిపోయాయి. మెగా ప్రిన్సెస్ రాకతో చిరంజీవి, సురేఖ నాయనమ్మ తాతయ్య అయిపోయారు. అంతేకాకుండా ఈ వార్తతో మెగా అభిమానుల‌ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. రీసెంట్ గానే ఈ జంట‌ 11వ పెళ్లిరోజును కూడా ఎంతో గ్రాండ్‌గా జరుపుకున్న ఈ జంట.. పెళ్లిరోజు అయిన కోద్దిరోజులోనే ఉపాసన ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీలోకి మహాలక్ష్మి వచ్చిందంటూ పండగేసుకుంటున్నారు.

Inside Ram Charan and Upasana's baby shower in Hyderabad. Allu Arjun has the sweetest wish - India Today

ఇప్పుడు ఈ వార్త బయటకు రావటంతో సోషల్ మీడియాలో రామ్ చరణ్- ఉపాసనలకు సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు. అయితే ముందు నుంచి కూడా రామ్‌చ‌ర‌ణ్ – ఉపాస‌న దంప‌తుల‌కు మ‌గ‌పిల్లాడు పుడ‌తాడ‌ని.. మెగా ఫ్యామిలీలో మ‌రో బుల్లి మెగాస్టార్ జన్మించ‌బోతున్నాడంటూ ప్ర‌చారం జ‌రిగింది. మెగాభిమానులు కూడా అదే ఆశ‌ల‌తో ఉన్నారు. అయితే ఇప్పుడు ఉపాస‌న – చెర్రీ ఫ్యాన్స్‌ను బుల్లి మెగాస్టార్ విష‌యంలో ఊరించి ఊసురు మ‌నిపించారు.