మెగా ఫ్యామిలీలో ఏకంగా ఇంత‌మంది కులాంతర వివాహాలు చేసుకున్నారా…. లిస్ట్ ఇదే..!

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఈ కుటుంబం నుంచి పదిమందికి పైగా హీరోలు టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. టాలీవుడ్ లో చిరంజీవితో మొదలైన మెగా ఫ్యామిలీ హవా ఇప్పుడు మరో లెవల్ కు చేరుకుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా ఉన్న వారిలో ఈ కుటుంబం నుంచి ముగ్గురు ఉన్నారు. చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఎలాంటి గొడవలు వచ్చిన అందులో మెగా ఫ్యామిలీ పేరు కచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఈ కుటుంబం ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది.

ఇలాంటి ఈ కుటుంబంపై ఎప్పుడూ ఒక కులాన్ని ఆపాదిస్తూ ఈ ఈ కుటుంబం పై విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ మెగా ఫ్యామిలీకి మాత్రం కులాల పిచ్చి ఉండదని వారు చేసుకున్న పెళ్లిళ్లు చేస్తే అర్థమవుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువగా కులాంతర వివాహాలు జరిగింది కూడా మెగాకుటుంబంలోనే. ఈ కుటుంబంలో చిరంజీవి- నాగబాబు మినహా మిగిలిన కుటుంబ సభ్యులందరూ కులాంతర వివాహాలు చేసుకున్నారు. వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి నిహారిక వరకు చాలామంది ఉన్నారు. అందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ లిస్టులోకే వస్తాడు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ :
ఈ కుటుంబంలో ఎప్పుడు పెళ్లిల విషయం వచ్చిన బాగా వినిపించే పేరు పవన్ కళ్యాణ్. ఇప్పటికే ఈయన తన జీవితంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. వారందరూ కూడా ఒకే కులానికి సంబంధించిన వారు కాదు. ముందుగా పవన్ కళ్యాణ్ నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈమెది కూడా పవన్ కళ్యాణ్ కులం కాదు. ఆ తర్వాత తనతో బద్రి సినిమాలో నటించిన రేణూ దేశాయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి రేణూ దేశాయ్‌‌. ఈమెకు విడాకులు ఇచ్చిన తర్వాత ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రష్యా దేశానికి చెందిన అన్నా లెజినోవాతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని కలిసి ఉంటున్నాడు.

శ్రీజ‌:
మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ ప్రేమ వ్యవహారం కూడా ఎంతో సంచలంగా మారింది. శ్రీజ కూడా చదువుకునే రోజుల్లోనే శిరీష్ భరద్వాజ్‌నే వ్యక్తిని ప్రేమించి ఇంట్లో వారిని ఎదిరించి మరి అతన్ని పెళ్లి చేసుకుంది. ఇక భరద్వాజ్ కూడా బ్రాహ్మణ కులానికి చెందినవాడు. అతడితో కూడా ఎక్కువ కాలం ఉండలేకపోయింది. తర్వాత శ్రీజ 2016లో కళ్యాణ్ దేవ్‌ని పెళ్లి చేసుకుంది. వీరిది కూడా కులాంతర వివాహమే. ఇప్పుడు వీరు కూడా దూరంగా ఉంటున్నారు.

అల్లు అర్జున్‌:
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ కూడా కులాంతర వివాహమే చేసుకున్నాడు. ప్రముఖ వ్యాపారవేత్త కే చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె స్నేహారెడ్డిని 2011లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లికూడా ఆ రోజుల్లో ఎంతో హాట్ టాపిక్ గా కూడా మారింది.

రామ్‌చ‌ర‌ణ్ :
చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కులాంతర వివాహమే చేసుకున్నాడు. అప్పట్లో వీరి పెళ్లి ఎంతో విపరీతంగా వార్త‌ల్లో వినిపించింది. దీనికి రెండు కారణాలు కూడా ఉన్నాయి.
ఒకటి.. కోటీశ్వరుడు అయిన అపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు కావ‌డం.

నిహారిక‌:
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కూడా కులాంతర వివాహం చేసుకుంది. ఈమె జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లయిన కొద్ది రోజులకే వీరి మ‌ద్య‌ మనస్పర్ధలు రావడంతో ఎవరి కారు దూరంగా ఉంటూ తాజాగా విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. అలాగే నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కూడా మరో హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఈమెది కూడా ఉత్తర ప్రదేశ్ కు చెందిన బ్రాహ్మణ కుటుంబం. ఇలా మెగా కుటుంబంలో ఎక్కువ శాతం కులాంతర వివాహాలు చేసుకున్న‌వారే.