చిత్ర పరిశ్రమలో ఉండే స్టార్ సెలబ్రెటీలు, హీరోయిన్లకు విడాకులు అనేది ఎంతో కామన్ విషయం. వారికి పెళ్లి జరిగీ సంవత్సరం కూడా కాకముందే నచ్చితే కలిసి ఉంటారు లేకపోతే విడాకులు తీసుకుని విడిపోతారు. ఇక వారి దృష్టిలో విడాకులు అనేది చాలా కామన్. ఇదే సమయంలో చిత్ర పరిశ్రమలో ఉండే బడా కుటుంబాల్లో ఇలాంటి విడాకులు కారణంగా ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి.
ఇక ఇలా ఇప్పటికే మెగా కుటుంబంతో పాటు అక్కినేని ఫ్యామిలీ కూడా ఇలాంటి విడాకుల బాధలు ఎదుర్కొంది. ముందుగా అక్కినేని కుటుంబంలో నాగార్జున, ఆయనపెద్ద కొడుకు నాగచైతన్య కూడా మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసిన విషయం అందరికీ తెలిసిందే. మెగా కుటుంబంలో అయితే ఏకంగా నలుగురు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా మెగా డాటర్ నిహారిక కూడా తన భర్తతో అధికారికంగా విడాకులు తీసుకున్నట్టు ఇప్పటికే ప్రకటించింది.
ఇలా ఎప్పుడూ మెగా కుటుంబంలో ఎంతమంది విడాకులు తీసుకున్నారో ఒకసారి చూద్దాం. ముందుగా మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు విజయ్ దుర్గా కూడా మొదట పంజా శివ ప్రసాద్ ని పెళ్లి చేసుకుని ఇద్దరు కొడుకులు పుట్టాక భర్తతో ఇబ్బందులు భరించలేక విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కొడుకులు ఇద్దరు తల్లి ఒంటరిగా ఉండటం ఇష్టం లేక మళ్లీ తల్లికి ఒక ప్రముఖ డాక్టర్ ని ఇచ్చి పెళ్లిలి చేశారు.
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కూడా ముందుగా తను ప్రేమించిన వ్యక్తి కోసం ఇంట్లో వారిని ఎదిరించి పెళ్లి చేసుకుంది. తర్వాత అతడితో విడాకులు తీసుకుని మళ్లీ తన ఇంట్లో వారు కుదిర్చిన కళ్యాణ్ దేవ్‌ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అతడికి కూడా ఈమె దూరంగా ఉంటుంది. ఇదే సమయంలో మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత కూడా మరో టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకొని తర్వాత క్యాన్సిల్ చేసిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు తాజాగా నిహారిక కొణిదెల కూడా ఇదే బాటలో నడుస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే గత ఆరు నెలలుగా తన భర్త చైతన్యకు దూరంగా ఉంటున్నా నిహారిక. ఇప్పుడు ఎట్టకేలకు తన భర్తతో విడాకులు తీసుకుంటున్న విషయం బయట పెట్టేసింది. ఇదే సమయంలో మెగా కుటుంబంలో విడాకులు అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ ఇప్పటికీ మూడు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చేసారు. ఇప్పుడు మూడో భార్యకు కూడా విడాకులు ఇవ్వబోతున్నట్టు పలు వార్తలు వైరల్ గా మారాయి. అయితే మెగా ఫ్యామిలీకి ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటే కేవలం విడాకుల కారణంగా ఫ్యామిలీకి పెద్ద రిమార్క్ పడుతోంది. ఈ విడాకులే మెగా ఫ్యామిలీ కి శాపంగా మారుతున్నాయి అంటూ చాలామంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.