ఎట్టకేలకు పదేళ్లకు పైగా ఊరించి ఊరించి మెగాస్టార్ తాతయ్య అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్ దంపతులకు రీసెంట్ గా అపోలో హాస్పటల్లో పాప పుట్టిన సంగతి తెలిసిందే. రామ్‌చరణ్ – ఉపాసన కామినేని దంపతులకు పదేళ్ల క్రితమే పెళ్లయ్యింది. ఇన్నేళ్ల కాలంలో రామ్‌చరణ్ – ఉపాసన ఎప్పుడు తల్లిదండ్రులు అవుతారు ? వీరు ఎప్పుడు పిల్లలను కంటారు ? అంటూ ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి.
మధ్యలో చిరంజీవికి కూడా ఈ ప్రశ్న ఎదురైంది. అయితే చిరు కూడా తాను పిల్లలను కనే విషయాన్ని వారి ఇష్టానికే వదిలేశానని చెప్పారు కూడా..! ఎట్టకేలకు పెళ్లి అయిన పదేళ్ల తర్వాత చిరు – ఉపాసన రీసెంట్‌గా తల్లిదండ్రులు అయ్యారు. అపోలో హాస్పిటల్లో ఉపాసనకు డెలివరీ చేశారు. ఇక ఈ బేబీ బారసాల కార్యక్రమం కూడా ఎంతో వైభవంగా నిర్వహించారు.
ఈ బారసాల కార్యక్రమంలో మెగాప్రిన్సెస్‌కు నామరణోత్సవం కూడా జరిపారు. మెగాస్టార్ తన ముద్దుల మనవరాలికి క్రీం కార అనే పేరు పెట్టారు. అమ్మవారి సహస్రనామోత్సవాల నుంచి ఈ పేరు తీసుకుని పెట్టారు. ఇదిలా ఉంటే రామ్‌చరణ్ – ఉపాసన దంపతులకు అమ్మాయి పుట్టడంతో మెగా ఫ్యామిలీలో అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. తమ ఇంటికి ఆడపడుచు పుట్టిందని సంతోష సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
అయితే ఒక్కరికి మాత్రం రామ్‌చరణ్‌కు ఆడపిల్ల పుట్టడం ఏ మాత్రం నచ్చలేదట. ఆమె ఎవరో కాదు మెడాస్టార్ పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల. ఆమె మాట్లాడుతూ మా ఇంట్లో ఇప్పటికే నలుగురు ఆడపిల్లలు ఉన్నారు.. చరణ్‌కు కొడుకు పుడితే బాగుండును.. పాప పుట్టడం నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదని కామెంట్లు చేసిందట. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.