చిరంజీవి కూతురు సుస్మిత కూడా ఆ ప‌ని చేసిందా… ఇన్నాళ్ల‌కు బ‌య‌టప‌డ్డ టాప్ సీక్రెట్‌..!

ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఇండస్ట్రీలో మెగా సామ్రాజ్యాని ఏర్పాటు చేసుకున్నాడు. మొదట తాను హీరోగా గుర్తింపు తెచ్చుకుని తర్వాత తమ్ముళ్లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అలా మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి ఎంత మంది అడుగు పెట్టారో అందరికీ తెలిసిందే. కాగా మెగా హీరోస్‌తోపాటు మెగా ఆడపడుచులు కూడా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

అస‌లు ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోల‌తో టాలీవుడ్‌లో ఓ క్రికెట్ టీం త‌యారైపోయింది. కేవ‌లం ఆ ఫ్యామిలీ నుంచే 11 మందికి పైగా హీరోలు వ‌చ్చేశారు. ఇక మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె నిహారిక కూడా త‌న ఫ్యామిలీ వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకుని బుల్లితెర‌తో పాటు వెండితెర మీద కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. నిహారికా ఇప్పటికే రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించినా స‌క్స‌స్‌ కాలేకపోయింది.

ప్రస్తుతం నిర్మాతగా వ్యవహరిస్తూ కొన్ని వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా కాస్ట్యూమ్ డిజైనర్‌గా.. అలానే ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో తెర‌వెనుక పని చేస్తుంది. చిరంజీవి తన పెద్ద కూతురు సుస్మితను హీరోయిన్ చేయాలని ఎన్నోసార్లు అనుకున్నారట. అలాగే సుస్మిత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా కూడా మొదలుపెట్టారట.

ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించాడ‌న్న‌గుస‌గుస‌లు అప్ప‌ట్లో వినిపించాయి. ఈ సినిమా మొదటి పార్ట్ మొత్తం పూర్తయినా సెకండ్ హాఫ్ లో కథ‌ బాలేదనిపించి సినిమా షూటింగ్ మధ్యలోనే ఆపేశారట. సినిమా షూటింగ్ పూర్తయి ఉంటే సుస్మిత కూడా ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం అయ్యేది. ఇక ఉదయ్ కిరణ్ – సుస్మితల సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోవడంతో ఆ తర్వాత చిరంజీవి కూడా సుస్మితను హీరోయిన్ చేయాలని ఆలోచన మానుకున్నాడట. దాంతో సుస్మిత ప్రొడ్యూసర్ గా తెర వెనకే మిగిలిపోయింది.