మెగా ఫ్యామిలీలో వరుసగా పెళ్లిళ్లు విడాకులు పరంపర కంటిన్యూ అవుతూనే ఉంది. అసలు ఈ ఫ్యామిలీలో ఎప్పుడు ఎవరి పెళ్లి జరుగుతుందో ? ఎవరు విడాకులు తీసుకుంటారో కూడా తెలియని పరిస్థితి వచ్చేసింది. ఈ క్రమంలోనే ఈ ఫ్యామిలీ నుంచి ముందుగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల మ్యాటర్ ఎప్పుడూ ఆసక్తికరమే. ఆ తర్వాత మెగాస్టార్ రెండో కుమార్తె శ్రీజ రెండు పెళ్లిళ్లు కూడా పెటాకులు అయ్యాయి.
శ్రీజ తన రెండో భర్త కళ్యాణ్‌దేవ్‌కు దాదాపు విడాకులు ఇచ్చేసినట్టే..! విచిత్రం ఏంటంటే శ్రీజకు మొదటి భర్తతో ఓ పాప.. భర్తకు విడాకులు ఇచ్చేసి ఆ పాపను ఎత్తుకుని మరీ రెండో భర్తతో పెళ్లి చేసుకుంది. అప్పట్లో అదో కామెడీ. ఇక రెండో భర్త కళ్యాణ్‌దేవ్‌తో కూడా ఓ పాప పుట్టాక మనస్పర్థల నేపథ్యంలో విడాకులకు సిద్ధమవుతోంది. శ్రీజ మొదటి పెళ్లి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టే టైంలో జరిగింది.
శిరీష్ భరద్వాజ్ అనే తన ఫ్రెండ్‌ను ప్రేమించుకుని హైదరాబాద్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. అప్పట్లో చిరంజీవి మీడియా ముందుకు వచ్చి అమ్మా శ్రీజ నేనమ్మా నాన్నను రామ్మా అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత శ్రీజ ఏకంగా భర్తతో కలిసి ఢిల్లీలో కాపురం పెట్టింది. ఆ తర్వాత భర్త ఇంటి నుంచి ఆస్తిపాస్తులు తీసుకురమ్మని వేధించాడని.. చిరంజీవికి ఫోన్ చేసి తాను తప్పు చేశానని ఎంతో బాధపడిందని.. కూతురు పరిస్థితి చూసి చిరు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారని టాక్.
అటు కూతురు బాధ చూసి చిరు నరకం అనుభవించారట. ఈ టైంలో ప్రజారాజ్యం పార్టీతో ఎన్నికల్లో పరాభవం తప్పలేదు. చివరకు శ్రీజ భర్త టార్చర్ తట్టుకోలేక విడాకులు ఇచ్చేసిందంటారు. శ్రీజ అంటే చిరుకు ఎంతో ఇష్టం. అందుకే విడాకుల తర్వాత చాలా యేళ్ల పాటు తన ఇంట్లోనే శ్రీజను ఉంచుకున్నారు. అనంతరం కళ్యాణ్‌దేవ్‌తో రెండో పెళ్లి చేసినా శ్రీజ మనస్తత్వం కారణంగా ఆ బంధాన్ని కూడా నిలుపుకోలేదంటారు.