దర్శకధీరుడు రాజమౌళి నిజంగా టాలీవుడ్ లో ఎవ్వరు ఊహించని కాంబినేషన్ సెట్ చేసి సంచలనం క్రియేట్ చేశారు. కొన్ని దశాబ్దాల నుంచి నందమూరి – మెగా కాంపౌండ్ హీరోల అభిమానుల మధ్య ప్రచ్చన్న యుద్ధం నడుస్తూ ఉంటుంది. ఎవరికివారు తమ హీరో గొప్పవాడు అని చెబుతూ ఉంటారు. అయితే రాజమౌళి అనూహ్యంగా రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో త్రిబుల్ ఆర్ తెరకెక్కించి పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ కొట్టాడు.
ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ కోసం టాలీవుడ్ సినీ జనాలు ఏకంగా 20 సంవత్సరాల నుంచి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ఎన్నో రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది.
ఇది కూడా మల్టీస్టారర్ సినిమాయే ప్రస్తుతం ఈ సినిమా కోసం రాజమౌళి ఆయన టీం ప్రి ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం రచయిత విజయేంద్రప్రసాద్ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నారట. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ కథ ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడట.
అదే నిజం అయితే అసలు అంతకు మించి సెన్షేషన్ మరొకటి ఉండదనే చెప్పాలి. వెంటవెంటనే ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్లో రెండు సినిమాలు అంటే పెద్ద రికార్డే. అయితే ఎన్టీఆర్‌కు ఈ సినిమాలో ఎలాంటి పాత్ర ఉంటుంది ? మహేష్‌తో సమానమైన పాత్ర లేదా ? ఏదైనా గెస్ట్ రోల్లా ఉంటుందా ? అన్నదానిపై క్లారిటీ రావాలి.