చిత్ర పరిశ్రమల కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉంటాయి.. అలాంటి కాంబోలో మహేష్ – సాయి పల్లవి కాంబినేషన్ కూడా ఒకటి. వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే చూడాలని అభిమానులు ఎప్పటినుంచో కలలు కంటున్నారు. కానీ ఆ సమయం మాత్రం రావడం లేదు. గతంలో మహేష్ – సాయి పల్లవి కాంబోలో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు మిస్సయ్యాయి. మీరు వింటుంది నిజమే.. ఆ మిస్సయిన సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఫిదా సినిమాతో నాచురల్ బ్యూటీ సాయి పల్లవి టాలీవుడ్‌కి పరిచయమైంది.
శేఖర్ కముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ , సాయి పల్లవి జంటగా నటించారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక తన తొలి సినిమాతోనే సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది.. ఈ క్రమంలోనే దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాను ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయాలనుకున్నాడట.
మహేష్ కు కూడా ఈ కథ బాగా నచ్చిందట. కానీ ఇతర సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉండటంవల్ల మహేష్ ఈ సినిమానుమాను వదులుకోవాల్సి వచ్చింది. అలా మహేష్ – సాయి పల్లవి కాంబోలో ఈ సూపర్ హిట్ సినిమా మిస్సయింది. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబోలో మరో బ్లాక్ బస్టర్ మూవీ తప్పిపోయింది. ఆ సినిమా మరి ఏదో కాదు సరిలేరు నీకెవ్వరు. దర్శకుడు అనిల్ రావుపూడి – మహేష్ కాంబోలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది.
ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం చిత్ర యూనిట్ సాయి పల్లవినేే సంప్రదించారట. ఈ సినిమా స్టోరీ విన్న సాయి పల్లవి అందులో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదనే కారణంగా ఈ సినిమాకు నో చెప్పింది. ఈ విధంగా రెండోసారి కూడా మహేష్ – సాయి పల్లవి కాంబోలో మరో సినిమా మిస్ అయింది. ఇక మరి రాబోయే రోజుల్లో అయినా వీరి కాంబోలో బ్లాక్ బస్టర్ సినిమా వస్తుందో లేదో చూడాలి.