టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తోన్న లేటెస్ట్ SSMB 28 సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలతో ఉంది. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన అతడు, ఖలేజా రెండు సినిమాలు కూడా వెండితెరపై అంచనాలు అందుకోలేకపోయినా ఇప్పటకీ బుల్లితెరను షేక్ చేస్తూనే ఉంటాయి. అతడు, ఖలేజా ఇప్పుడు టీవీల్లో వచ్చినా అదిరిపోయే టీఆర్పీ రేటింగ్స్ వస్తూ ఉంటాయి.
ఇక 13 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉండడంతో సహజంగానే ఈ సినిమాతో బాక్సాఫీస్ షేక్ అయిపోతుందనే ట్రేడ్, ఇండస్ట్రీ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఇక ఎట్టకేలకు ఊరిస్తూ వస్తోన్న ఈ సినిమా టైటిల్ ఈ రోజు ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు గుంటూరు కారం టైటిల్ ఫిక్స్ చేశారు, హైలీ ఇన్ ఫ్లేమబుల్ ఉప శీర్షిక.
మహేష్‌బాబు మాస్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక టైటిల్ రివీల్ చేసిన మేకర్స్ ఓ మాస్ స్ట్రైక్ కూడా వదిలారు. ఈ మాస్ స్ట్రైక్‌లో తలకి స్కార్ప్ కట్టుకుని ఊర మాస్ స్టైల్లో ఫైట్ చేస్తున్న సీన్ అయితే నిజంగా ఊరమాస్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది.
త్రివిక్రమ్ తన స్టైల్‌కు భిన్నంగా వెళుతున్నట్టే ఉంది. ఇక గ్లింప్స్‌లో విజువల్స్‌తో పాటు, ఆర్ ఆర్ అయితే అదిరిపోయేలా ఉంది. అయితే ఈ సినిమా టైటిల్ లోగోతో పాటు మహేష్ తలకు కట్టు కట్టుకుని ఉన్న స్టిల్స్ అయితే సేమ్ ఖలేజా టైటిల్ లోగోతో పాటు ఖలేజా స్టిల్స్‌ను గుర్తుకు తెస్తున్నాయి. ఇక హారికా హాసిని బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ సినిమా 2024 జనవరి 13న గ్రాండ్ లెవెల్లో విడుదల చేయనున్నారు.