పాన్ ఇండియా సినిమాలు స్టార్ట్ అయిన దగ్గర్నుంచి తెలుగు హీరోలు రు.100 కోట్ల రెమ్యూనరేషన్ కోట్లు తీసుకోవడం కామన్ అయిపోయింది. కానీ కేవలం తెలుగు వెర్షన్ కి హైయస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటూ టాప్ స్టేజ్ లో ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. గుంటూరు కారం సినిమాకు మహేష్ బాబు రెమ్యూనరేషన్ ఎంతో ? తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. కేవలం తెలుగు వెర్షన్ లోనే రిలీజ్ అవుతున్న గుంటూరు కారం సినిమాకు మహేష్ బాబు రెమ్యూనరేషన్ రూ.78 కోట్లు అని సమాచారం.
సింగిల్ లాంగ్వేజ్ సినిమా హీరోకి ఇంత రెమ్యూనరేషన్ అంటే రికార్డ్ అని చెప్పాలి. గుంటూరు కారం సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా టోటల్ మార్కెట్ రూ.250 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు మూవీ మేకర్స్. థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రూ.100 నుంచి రూ.150 కోట్లు మధ్యలో ఆదాయం ఉండనుంది. ఆడియో హక్కులకు రూ.20 కోట్లు – నైజాం థియేటర్ హక్కులు రూ.45 కోట్లని అంటున్నారు.
ఆంధ్ర థియేటర్ హక్కులకు రూ.60 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. ఓవర్సీస్ రైట్స్ కోసం రూ.20 కోట్లకు పైగా కోట్ చేస్తున్నారట. ఇవన్నీ లెక్కలు వేసుకుంటే గుంటూరు కారం టోటల్ మార్కెట్ రూ.250 కోట్లకు పైగా ఉంటుందని అర్థమవుతుంది. ఈ సినిమాకు ఇంత బిజినెస్ జరిగినప్పుడు రూ.78 కోట్లు రెమ్యూనరేషన్ మహేష్ కు ఇవ్వడంలో నిర్మాతలకు వచ్చిన లాస్ ఉండదంటున్నారు. పాన్ ఇండియా కాకుండా సింగిల్ లాంగ్వేజ్ సినిమాకు ఈ రేంజ్ రెమ్యునరేషన్‌తో మహేష్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు.
త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లా మంచి అంచనాలు ఉన్నాయి. పైగా అలవైకుంఠపురం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమా కావడం, మహేష్ బాబు మరో సినిమా రావాలంటే మరో రెండేళ్లు పెట్టే టైం ఉండడంతో గుంటూరు కారంపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. దీంతో గుంటూరు కారం సినిమా బిజినెస్ రికార్డుల మోత మోగిస్తోంది.