టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. టాలీవుడ్‌లోనే ఇప్పుడు మహేష్ తిరుగులేని స్టార్ హీరోగా దూసుకు పోతున్నాడు. ఇక మహేష్ దివంగత లెజెండ్రీ హీరో కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ నుంచే ఇప్పటికే చాలా మంది నటులు ఇండస్ట్రీలోకి వచ్చారు. కొద్ది రోజుల కిందటే మహేష్ ఫ్యామిలీ నుంచి గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
గల్లా అశోక్ ఎవరో కాదు… మహేష్ పెద్ద అక్క పద్మావతి తనయుడు. మనోడు టాలీవుడ్‌లో హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు అశోక్ రెండో సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఇదే ఫ్యామిలీ నుంచి మరో హీరో కూడా వెండితెరంగ్రేటం చేస్తున్నాడు. ఆ హీరో ఎవరో కాదు గల్లా అశోక్ తమ్ముడు సిద్దార్థ.
అశోక్‌కు హీరోగా మహేష్ చాలా బాగా సపోర్ట్ చేస్తూ వచ్చాడు. తొలి సినిమాతోనే తానేంటో అశోక్ ఫ్రూవ్ చేసుకున్నాడు. మనోడికి మహేష్, ఘట్టమనేని అభిమానులు బాగా సపోర్ట్ చేస్తూ వచ్చాడు. ఇక ఇప్పుడు సిద్ధార్థ్‌కు కూడా మహేష్ సపోర్ట్ చేస్తాడంటున్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తాడని తెలుస్తోంది.
ఈ సినిమాలో సిద్ధార్థ్‌కు జోడీగా హీరోయిన్ గా శ్రీలీలను తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం అయ్యాయంటున్నారు. మరి సిద్ధార్థ్ ఎంట్రీ మూవీ ఎలా ? ఉంటుందో ? చూడాలి.