మ‌హేష్‌బాబు సినిమాకు VFX డైరెక్ట‌ర్‌గా రానా… ఆ సినిమా ఏదో తెలుసా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రానాకి ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. లీడర్ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రానా ఒకే రకమైన పాత్రలను కాకుండా వైవిధ్య‌మైన పాత్రలను ఎంచుకుంటూ చాలా సినిమాలలో నటించాడు. రాన‌కు ఎంత బ‌ల‌మైన సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉందో తెలిసిందే. రానా తాత రామానాయుడు లెజెండ్రీ నిర్మాత‌. తండ్రి సురేష్‌బాబు అగ్ర నిర్మాత‌. బాబాయ్ వెంక‌టేష్ స్టార్ హీరో.

ఇలా దగ్గుబాటి సినీ బ్యాక్‌గ్రౌండ్‌తో ఎంట్రీ ఇచ్చిన రానాకి కృష్ణం వందే జగద్గురుం సినిమాలో నటించిన విధానం ప్రేక్షకుల్లో ఎంతగానో గుర్తింపు తెచ్చిపెట్టింది. క్రిష్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాలో రానాని విలన్ రోల్ లో తీసుకోవడానికి కారణం కూడా కృష్ణం వందే జగద్గురుం సినిమాలో రానా నటించిన విధానమేనట.

ఇక బాహుబలి సినిమాలో బళ్లాలదేవుడిగా రానా ఎంత భయంకరమైన విల‌నిజం పండించాడో మనం చూసాం. అప్పటి వరకు కేవలం టాలీవుడ్‌కి పరిమితమైన రానా ఈ సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. అసలు విషయానికి వస్తే యాక్టర్ కాకముందు రానా కంప్యూటర్ గ్రాఫిక్స్ – వీఎఫ్ ఎక్స్ లో కోచింగ్ తీసుకున్నాడట. చాలామందికి తెలియని విషయం ఏంటంటే రానా సినిమాల్లోకి రాకముందు కొన్ని సినిమాలకు గ్రాఫిక్ వర్క్‌చేశాడు.

అలా రానా గుణశేఖర్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సైనికుడు సినిమా లో గ్రాఫిక్స్ వర్కర్ గా పనిచేశాడు. సినిమాలో హైలెట్ గా నిలిచిన బ్రిడ్జ్ కూలిపోయే సన్నివేశాన్ని డిజైన్ చేసింది రానానే. అంతేకాదు ఆ సినిమాలో అలాంటి గ్రాఫిక్ వర్క్స్ చాలా సహజంగా ఉండేటట్లు రానా డిజైన్ చేశాడు. కానీ తర్వాత ఎందుకో ఆ వృత్తిపై ఆసక్తి పోయిన రానా యాక్టర్స్ గా అడుగుపెట్టి లీడర్ సినిమాతో కెరియర్ స్టార్ట్ చేసి.. పాన్ ఇండియా రేంజ్‌కి ఎదిగాడు.