టాలీవుడ్ లో చాలామంది నటీనటులు ఓ కాంబోలో నటించి ఆ సినిమా హిట్ అయ్యిందంటే అదే కాంబోను రిపీట్ చేస్తూ ఎన్నోసార్లు హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ఇప్పటికీ ఇదే ట్రెండ్ చాలా సార్లు టాలీవుడ్ లో రిపీట్ అయింది. మహేష్ బాబు మాత్రం ఒక హీరోయిన్ తో నటించే ఛాన్స్ ను వరుసగా మూడుసార్లు రిజెక్ట్ చేశాడట. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తండ్రి కృష్ణ సినీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మహేష్ బాబు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకొని టాప్ మోస్ట్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. మహేష్ బాబుకి సింపుల్ సిటీ అంటే ఇష్టమని.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాడని.. పెద్దగా గొడవలకు ఇష్టపడని చాలా సైలెంట్ గా ఉంటాడన్నది ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో వినిపించే టాక్ ?
అలాంటి హీరోతో కూడా వైరాన్ని పెట్టుకుందట ఓ హీరోయిన్. అందుకే ఏకంగా ఒకటికి మూడుసార్లు ఆమెతో వచ్చిన సినిమా ఛాన్స్ ను రిజెక్ట్ చేశాడట మహేష్ బాబు. ఆమెని రిజెక్ట్ చేసి వేరే హీరోయిన్లతో ఆ సినిమాలలో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ నీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకీ మహేష్ బాబుతో వైరం పెంచుకున్న ఆ హీరోయిన్ మరెవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార.
నయనతార సినిమాలు విషయంలో ఎలాంటి కండిషన్స్ పెడుతుందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ బాబుతో అవకాశం వచ్చినప్పుడు తిక్క తిక్క కండిషన్స్ పెట్టిందట దీంతో కోపం వచ్చిన మహేష్ బాబు నయన్ తోక కత్తిరించి నయన్‌ని సినిమాలోంచి తీసి వేరే హీరోయిన్ పెట్టుకున్నాడట. అలా నయనతారతో సినిమాను మూడుసార్లు రిజెక్ట్ చేశాడంటారు. లేకపోతే సీతమ్మవాకిట్లో, వన్ సినిమాల్లో ముందుగా అనుకున్న హీరోయిన్ నయనతారే అంటారు.