తండ్రి సినిమానే కాపీ కొట్టి హిట్ కొట్టిన మ‌హేష్‌బాబు..ఆ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా ఇదే..!

సూపర్ స్టార్ కృష్ణ సినీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు మహేష్ బాబు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకున్న మహేష్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు కోట్లాదిమంది లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. మహేష్ కెరియర్లోనే ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ‘ శ్రీమంతుడు ‘ సినిమా ఒకటి.

శృతిహాసన్ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, జగపతిబాబులు కీరోల్స్ ప్లే చేశారు. ఈ సినిమాలో ద రిచెస్ట్ పర్సన్ గా మహేష్ బాబు కనిపిస్తాడు. ఓ ఊరిని బాగు చేయడం కోసం దత్తత తీసుకొని విల‌న్ల‌ నుంచి ఊరిని కాపాడతాడు. అదే ఊరికి చెందిన అమ్మాయి శృతిహాసన్‌తో ప్రేమలో పడి చివరకు ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఊరిని దత్తత తీసుకొని బాగు చేయడం అనే కాన్సెప్ట్ ప్రేక్షకుల్లో కొత్తగా అనిపించడంతో ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు.

కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మంచి సందేశం కూడా ఉండడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్‌ కలెక్షన్లు వ‌సూలు చేసింది. అయితే గతంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమా క‌థ స్టైల్లోనే మ‌హేష్ శ్రీమంతుడు సినిమా కూడా ఉంటుంది. ఇదే కాన్సెప్ట్ తో గతంలో కృష్ణ నటించిన ఓ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఆ సినిమా పేరు ‘ రామ రాజ్యంలో భీమరాజు ‘. ఏ కోదండరామి రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో కృష్ణ, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించారు.

ఈ సినిమా స్టోరీ కూడా శ్రీమంతుడు స్టోరీలానే అనిపిస్తుంది. కోట్లకు వారసుడైన కృష్ణ‌ ఓ గ్రామాన్ని విలన్ నుంచి కాపాడి అదే ఊరికి చెందిన శ్రీదేవిని ప్రేమించి వివాహం చేసుకుంటాడు. 1983లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాని చూస్తే శ్రీమంతుడు సినిమా చూసినట్టే ఉంటుంది. మొత్తానికి ఒకే సినిమా స్టోరీతో కృష్ణ మహేష్ ఇద్దరూ హిట్ తమ ఖాతాలో వేసుకున్నారు.