సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన బిజినెస్ మాన్ చిత్రం కమర్షియల్ గా భారీ విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. కానీ మహేష్ బాబు కెరీర్ లో చాలా ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ట్రెండ్ సెట్టర్ సినిమాగా నిలిచిన బిజినెస్ మాన్ రీ రిలీజ్ కి సిద్ధమయ్యింది.
మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్ గా ఆగస్టు 9న విడుదల కాబోతున్న ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం అయ్యింది. వైజాగ్ లో సంగం థియేటర్లో ఉదయం 7 గంటలకు ప్రత్యేక షో ఏర్పాటు చేయబోతున్నారు. ఆ షో కి సంబంధించిన టికెట్లు గంట సమయంలోనే అమ్ముడుపోయాయి. సంగం, శరత్ థియేటర్లో సినిమాని భారీ ఎత్తున అభిమానులు చూడబోతున్నారు.
మహేష్ బాబు సినిమాలు రీరిలీజ్ అయిన దాఖాలాలు చాలనే ఉన్నాయి. అయినా కూడా ఈ చిత్రానికి స్పెషల్ క్రేజ్ ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అందకు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ నిదర్శనం అంటూ మహేష్ బాబు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక వైజాగ్ లోనే కాకుండా తెలుగు రాష్ట్రల్లో పెద్ద ఎత్తున ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
మహేష్ బాబు కి జోడిగా కాజల్ అగర్వాల్ నటించినది. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. అప్పట్లో సినిమా పాటలన్నీ కూడా మంచి హిట్ అయ్యాయి. తక్కువ సమయంలో తెరకెక్కిన సినిమాల్లో బిజినెస్ మాన్ ముందుంటుంది. కమర్షియల్ గా హిట్ కాకపోయినా తక్కువ బడ్జెట్ తో రూపొందిన కారణంగా డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతకు ఈ సినిమా పెద్దగా నిరాశపరచలేదు. ఇక మరోసారి రీరిలీజ్‌లో కూడా ఈ సినిమా ఎలాంటి అంచనాలు అందుకుంటుందో చూడాలి.