మహేష్- రాజమౌళి గతంలో కలిసి సినిమా చేశారనే విషయం మీకు తెలుసా..!?

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ముందుగా ఈ దర్శకుడికి కూడా కెరీర్ మొదటిలో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. దర్శకుడుగా తాను ఏంటో నిరూపించుకోవాలని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తూ అదే సమయంలో శాంతినివాసం సీరియల్ కు దర్శకుడుగా కూడా పని చేశాడు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలుకు రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నారనే విషయం చాలామందికి తెలియదు.

అయితే ఇప్పుడు ఆయన ఏ ఏ సినిమాలుకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారని విషయాన్ని ఇప్పుడు కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అలా ఆయన చేసిన సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రాజకుమారుడు సినిమా కూడా ఉంది. మహేష్ బాబు సోలో హీరోగా టాలీవుడ్‌కు పరిచయం అవుతూ చేసిన తొలి సినిమా కూడా రాజకుమారుడే. ఈ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్‌గా నిలిచి ఆ రోజుల్లోనే రూ. 9 కోట్లకు పైగా భారీ కలెక్షన్ రాబట్టింది. ఇక ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా రాజమౌళి పనిచేసాడు అనే విషయం ఇప్పటివరకు చాలామందికి తెలియదు.

రీసెంట్గా రాఘవేంద్ర రావు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు ఈ విషయం బయటకు రావడంతో మహేష్ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ రాజమౌళి కాంబోలో వస్తున్న పాన్ వ‌ర‌ల్డ్‌ సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్న సమయంలో ఈ వార్త బయటకు రావడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.

ఆరోజు మహేష్ తొలిసారి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రాజమౌళి ఇప్పుడు అదే మహేష్ తో 1500 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా గురించి త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుంది. ఇక మహేష్ పుట్టినరోజు సందర్భంగా కూడా ఎవరు ఊహించిన అప్డేట్ వస్తుందని కూడా అంటున్నారు. మహేష్- రాజమౌళి కాంబోలో వస్తున్న రెండో సినిమా కూడా ఇదే అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక మరి రాజమౌళి- మహేష్ కాంబోలో వస్తున్న పాన్ వ‌ర‌ల్డ్ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలంటే మరికొన్ని సంవత్సరాలు ఎదురు చూడాల్సిందే.