ఆ సినిమాలో వేసిన రోల్ వ‌ల్లే సౌంద‌ర్య చ‌నిపోయిందా… వామ్మో ఇది నిజ‌మేనా..!

ప్రముఖ నటి దివంగత హీరోయిన్ అందాల తార సౌందర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె మన మధ్య లేకపోయినా సరే.. ఆమె మనకు అందించిన చిత్రాల ద్వారా ఎప్పటికీ చిరస్థాయిగా మనలోనే నిలిచిపోతుంది. అంతటి సౌందర్య రూపవతి అయిన ఈ ముద్దుగుమ్మ ఒకప్పటి అంజలి దేవి, సావిత్రి, షావుకారు జానకి వంటి హీరోయిన్లను మనకు జ్ఞప్తికి తీసుకొస్తుంది.

అంతటి పేరు దక్కించుకున్న సౌంద‌ర్య లేక‌పోయినా ఆమె సినిమాలు మాత్రం ఎప్పటికీ ప్రేక్షకులలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అంతటి గుర్తింపు తెచ్చుకున్న సౌందర్య పట్టుమని 27 ఏళ్లు కూడా నిండకముందే కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈమె జాతకం ప్రకారం అర్ధాంతరంగా తనవు చాలిస్తుంది అని.. గతంలోనే ఆమె తండ్రి వెల్లడించారు.

ఆయన చెప్పినట్టుగానే సౌందర్య జీవితం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇదిలా ఉండగా సౌందర్య మరణం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళితే సౌందర్య చనిపోయి ఇప్పటికి దాదాపు 20 ఏళ్లు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆమె మరణానికి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

ఇకపోతే చంద్రముఖి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాను కన్నడలో ముందే ఆప్తమిత్ర పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నాగవల్లి పాత్రలో సౌందర్య అద్భుతంగా నటించింది. ఆ సినిమా సమయంలోనే సౌందర్య ను ఏదో శక్తి ఆవహించిందని.. ఆ శక్తి వల్లే సౌందర్య మరణించింది అంటూ ఆమె చనిపోయాక కొంతమంది జ్యోతిష్యులు చెప్పారు.

శశికళ అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఈ సినిమాలోని నాగవల్లి పాత్రకు డబ్బింగ్ చెబుతున్న రోజులు ఆమె చుట్టూ ఏదో ఒక శక్తి ఆవహించినట్లు.. తనను ఏదో ఒక శక్తి భయపెడుతున్నట్లు అనిపించేదని ఆమె ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇక ఆప్తమిత్ర 2 సినిమాలో నటించిన హీరో విష్ణువర్ధన్ కూడా సినిమాలో చేసినప్పుడు బాగానే ఉన్నా కొన్ని రోజులకే ఆయన మరణించాడు. దాంతో వీరి చావుకి ఆ సినిమాలోని పాత్రలకు ఏదో లింకు ఉందని చాలామంది భావిస్తున్నారు. మొత్తానికైతే ఆ పాత్ర సౌందర్య ను బలి తీసుకుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.