సావిత్రిని ఆ డైరెక్ట‌ర్‌ బాగా వాడేశాడా.. రాత్రిళ్లు ఇంటికి తీసుకెళ్లి మ‌రి..!

మ‌హాన‌టి సావిత్రి గురించి… ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆమె అభిన‌యం, అందం.. న‌భూతో.. అ న్న విధంగా ఉండేది. సినిమాల్లో ప్ర‌త్యేకంగా సావిత్రిని చూసేందుకు ప్రేక్ష‌కులు క్యూ క‌ట్టేవారు. అయితే.. తెలుగులో క‌న్నా.. త‌మిళంలోనే సావిత్రి ఎక్కువ‌గా సినిమాలు చేశారు. అదికూడా జెమినీ గ‌ణేష‌న్‌తోనే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌కు అంత ఫాలోయింగ్ ఉండేది.

అయితే.. జెమినీ గ‌ణేశ‌న్ కొన్ని కొన్ని సినిమాల్లో చాలా అభ్యంత‌ర‌కరంగా వ్య‌వ‌హ‌రించేవార‌ని సినిమా క్రిటిక్స్ అంటారు. సావిత్రి ముందే.. వేరే న‌టుల‌తో ఆయ‌న చ‌నువుగా ఉండేవార‌ట‌. అంతేకాదు… సావిత్రిని షూటింగ్ స్పాట్‌లోనే వ‌దిలేసి.. ఆయ‌న సైడ్ హీరోయిన్ల‌తో క్ల‌బ్బుల‌కు నైట్ పార్టీల‌కు వెళ్లేవార‌ట‌. దీంతో సావిత్రి అనేక సంద‌ర్భాల్లో షూటింగ్ స్పాట్‌లో ఒంట‌రిగానే మిగిలిపోయిన సంద‌ర్భాలు ఉన్నాయ‌ని చెబుతారు.

ఈ స‌మ‌యంలో ఇళ‌వ‌రసు అనే డైరెక్ట‌ర్‌.. సావిత్రిని త‌న ఇంటికి తీసుకువెళ్లార‌ని.. కొన్ని రాత్రులు ఆమె ఆయ‌న ఇంట్లోనే ఉన్నార‌ని .. గ్యాసిప్‌లు వ‌చ్చాయి. జెమినీ గ‌ణేశ‌న్‌కు స్నేహితుడు కూడా అయిన‌.. ఇళ‌వ‌ర‌స‌న్‌.. సావిత్రిని అలా తీసుకువెళ్ల‌డంపై అనేక క‌థ‌నాలు వ‌చ్చేవి. దీంతో త‌మిళ ప‌త్రిక‌లు వారిద్ద‌రి మ‌ధ్య ఏదో ఉందంటూ ర‌క‌ర‌కాల వార్త‌లు అల్లేసేవి.

అయితే.. ఇవ‌న్నీ.. ఉత్త‌వేన‌ని.. కేవ‌లం త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించేందుకే ఇళ‌వ‌ర‌సు త‌న‌ను ఇంటికి చేర్చేవార‌ని.. సావిత్రి అనేక సంద‌ర్భాల్లో వివ‌ర‌ణ ఇచ్చారు. కానీ, క్రిటిక్స్ దెబ్బ‌కు.. సావిత్రిని బాగా వాడేశార‌నే పేరు వ‌చ్చింది.