చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ వచ్చిన రామ్ చరణ్ కు రెండో సినిమాతోనే దర్శక ధీరుడు రాజమౌళితో చేసే అవకాశం వచ్చింది. అలా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాజమౌళి కాంబోలో వచ్చిన సినిమా మగధీర. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే ఓ మైల్ స్టోన్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో చరణ్ కు జంటగా కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించగా.. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించగా కీరవాణి సంగీతం అందించారు.
2009లో ప్రేక్షకులం ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుని తెలుగు చిత్ర పరిశ్రమ రూపు రేఖలను మార్చేసింది. దాదాపు రూ.40 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇంత భారీ బడ్జెట్ పెట్టేంత ఇమేజ్ రామ్ చరణ్ కు లేదు. పైగా అప్పటికి రామ్ చరణ్ చేసింది ఒక్క సినిమా మాత్రమే. అయినా కూడా అల్లు అరవింద్ రిస్క్ చేశారు. ఫైనల్ గా రాజమౌళి అద్భుతం సృష్టించారు. అప్పట్లో ఈ సినిమా రూ. 80 కోట్ల రేంజ్ లో వసూళ్లను రాబట్టి.. తిరుగులేని రికార్డులెన్నో సృష్టించింది.
అంతేకాకుండా 223 కేంద్రాల్లో వంద రోజులు.. 299 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది మగధీర. అదేవిధంగా రెండో సినిమాతోనే రామ్ చరణ్ స్టార్ హీరోగా మారిపోయాడు. అదేవిధంగా కాజల్ అగర్వాల్ కూడా తెలుగులోని మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. అయితే ఇక్కడ చాలామందికి తెలియని మరో విషయం ఏమిటంటే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు మొదటి ఛాయిస్ కాజల్ అగర్వాల్ కాదట.
ముందుగా రాజమౌళి మగధీర సినిమాలో అనుష్క శెట్టి హీరోయిన్‌గా తీసుకోవాలని భావించారట. ఎందుకంటే అప్పటిక అనుష్కతో రాజమౌళి విక్రమార్కుడు సినిమా చేశాడు.
ఆమె టాలెంట్ గురించి ఆయనకు తెలుసు కాబట్టి మగధీరలో హీరోయిన్ పాత్రకు అనుష్క పూర్తి న్యాయం చేస్తుందని ఆయన భావించారు. కానీ కథ నచ్చనప్పటికీ అనుష్క మగధీరను రిజెక్ట్ చేసింది. అందుకు కారణం అనుష్క కంటే రామ్ చరణ్ పొట్టిగా ఉండటమే. టాలీవుడ్ లోనే చాలామంది స్టార్ హీరోల కంటే అనుష్క శెట్టి చాలా హైట్.. ఆమెతో పోల్చుకుంటే రామ్ చరణ్ హైట్ తక్కువ తెరపై వీరిద్దరూ జంటగా నటిస్తే అక్క తమ్ముళ్లు మాదిరి ఉంటారు అదే ఊహించి అనుష్క మగధీర సినిమా రిజెక్ట్ చేసింది. అదే కాజల్ కెరీర్ కు ప్లస్ గా మారింది.