ఈనెల వచ్చేవారం జూన్ 10న రీ రిలీజ్ అవబోతున్న బాలకృష్ణ నరసింహనాయుడు సినిమా మీద టాలీవుడ్ బయ్యర్లు బాగా ఆసక్తి చూపిస్తున్నట్టు ఈ సినిమా బిజినెస్ లెక్కలు చూస్తుంటే అర్థమైపోతుంది.. 2001 లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హీట్ గా నిలిచి ఎన్నో సంచలన రికార్డులను నెలకొల్పింది. ఈ సినిమా సాధించిన రికార్డుల గురించి అభిమానులు ఇప్పటికీ ఎంతో గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఎప్పుడూ బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రింట్ ని ప్రత్యేక రీ మాస్టర్ చేయించి సెవెన్ పాయింట్ వన్ సౌండ్ తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతుని ఇవ్వచ్చని నిర్మాతలు భావిస్తున్నారు.
దానికి అనుగుణంగానే రెండు తెలుగు రాష్ట్రాల్ల థియేటర్లలో ఈ సినిమాను భారీగా విడుదల చేయనున్నారు. మరి ప్రధానంగా ఈ ఇండస్ట్రీ హిట్ సినిమాకి టైమింగ్ కూడా బాగా కలిసి వచ్చింది.ఈ నెల మూడో వారం వరకు థియేటర్లో పెద్ద సినిమా వచ్చే పరిస్థితి లేదు..అదే సమయంలో ఈనెల 9న సిద్ధార్థ్ నటించిన టక్కర్ సినిమా రానుంది.. ఈ సినిమాపై ప్రేక్షకులలో ఎలాంటి అంచనాలు కూడా లేవు.. ఒకవేళ ఈ సినిమాకు టాక్ పాజిటివ్గా వస్తే ఏం జరుగుతుందో చూడాలి. అలాగే బిగ్ బాస్ సన్నీ, సప్తగిరి హీరోలుగా నటించిన అన్ స్టాపబుల్ కూడా అదే రోజు రానుంది.
ఈ సినిమా పైన కూడా ఎలాంటి అంచనాలు కూడా లేవు. అదే సమయంలో కాన్సెప్ట్ నమ్ముకుని వస్తున్న సముద్రఖని, అనసూయ నటించిన విమానం సినిమాను చూసేందుకు థియేటర్లకు ప్రేక్షకులు రావాలంటే ఏదో అద్భుతం జరగాల్సిందే. సో ఇలాంటి సమయంలో మాస్ ప్రేక్షకులకి ఈ సినిమాల మరుసటి రోజు వచ్చే నరసింహనాయుడు ఎంతో బెస్ట్ ఆప్షన్ గా మారనుంది. ఎలాగో బాలయ్య పుట్టినరోజు కాబట్టి ఈ రీరిలీజ్ ని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు నందమూరి అభిమానులు ఇప్పటికే రెడీగా ఉన్నారు.
ఇదే సమయంలో బాలయ్య- అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న బాలయ్య 108వ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా ఆ రోజే రానుంది.. ఇక దీన్ని నరసింహనాయుడు తో పాటుగా ధియేటర్లలో విడుదల చేయబోతున్నారు.. ఇంతకన్న అభిమానులకు పెద్ద పండుగ ఇంకేముంటుంది. ఇప్పటికే బాలయ్య రీరిలీజ్ సినిమాలలో చెన్నకేశవరెడ్డి సినిమాతో అదిరిపోయే రికార్డులను తిరగరాశాడు.. ఇప్పుడు నరసింహనాయుడు సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతున్నాడు చూడాలి.