ఇటీవల సోషల్ మీడియాలో స్టార్ హీరో హీరోయిన్లు వారి వ్యక్తిగత విషయాలతో పాటు ఆన్ సీన్ ఫొటోలు, చిన్నప్పటి ఫొటోలను చాలా మంది షేర్ చేసుకుంటున్నారు. అలాగే ఆ ఫొటోస్ చాలా వైరల్ గా మారుతున్నాయి. నెటిజెన్లు కూడా నటీనటుల పర్సనల్ విషయాలపై క్యూరియాసిటీ చూపిస్తున్నారు. మనం పైన చూసిన ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ్ సినిమాల్లో నటించిన ఒక స్టార్ హీరోయిన్.
అలాగే ఓ సినిమాలో ఐటం సాంగ్స్ లో కూడా మెరిసింది ఈ క్యూట్ బ్యూటీ. ఈ ముద్దుగుమ్మ తెలంగాణలోని హైదరాబాద్‌లో పుట్టి పెరిగింది. ఆమె తెలుగులో నటించింది చాలా తక్కువ సినిమాలైనా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో మీరు గుర్తుపట్టారా..? గల్ఫ్ సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన డింపుల్ హయాతి. డింపుల్ గల్ఫ్ సినిమా తరువాత యురేకా, అభినేత్రి 2 , ఖిలాడి లాంటి సినిమాలలో నటించింది.
వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దెలకొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ అయినా జర జరా అనే పాటలో మెరిసింది డింపుల్. ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కనున్న రామబాణం చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది డింపుల్. ఇటీవల ఈ సినిమా పోస్టర్లు రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. ఈ సినిమాలో జగపతిబాబు, కుష్బూ ప్రధాన పాత్ర వహిస్తున్నారు. ఈ సినిమా మే 5 న రిలీజ్ కానుంది.