పెళ్ళికి ముందే వరుణ్- లావణ్య “బంచిక్ బంచిక్”.. ఈ మెగా ఆచారం భలే ఉందే..?

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో మెగా హీరో వరుణ్ తేజ్, స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పేర్లు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయోప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రీసెంట్ గానే ఎంతో గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ జంట పేరు మారు మ్రోగిపోతుంది. అంతేకాకుండా ఈ జంటకు సంబంధించిన ప్రేమ కథ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ క్రమంలోనే లావణ్య వరుణ్ ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో ఇండస్ట్రీలో ఉన్న స్టార్ సెలబ్రిటీలందరూ వీరికి శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఈ సమయంలోనే వారికి థాంక్స్ చెబుతూ వరుణ్ లావణ్య ఓ అదిరిపోయే ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. బ్యూటిఫుల్ కపుల్ కాంబోలో లాగా ఇద్దరూ ఒకే డ్రెస్ వేసుకుంటూ ఫారిన్ కంట్రీస్ లో షికార్లు చేస్తున్నారు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఈ ఫోటోపై కొందరు నెగిటివ్గా కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు పెళ్ళికి ముందు హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారా..? మరి కొంతమంది దారుణంగా మెగా ఫ్యామిలీకి ఇలాంటి అలవాటే కదా.. నాలుగు రోజులు కలిసి తిరగటం తర్వాత విడాకులు ఇవ్వడం అంటూ వారిపై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

అయితే ఈ ఇద్దరు తాజాగా ఫారెన్ వెళ్లారా..? లేక ఇది ఈ ఇద్దరు కలిసి దిగిన పాత ఫోటోనా..? అనేది క్లారిటీ లేదు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఈ పిక్ లో మ్యాచింగ్ కాస్ట్యూమ్స్ లో అదిరిపోయే లుక్స్ లో రెచ్చగొడుతున్నారు. ఈ విషయం ఇలా ఉంచితే మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే వరుణ్ లావణ్య ఇద్దరి ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య కూడా ఒకటే. ఇక ఇద్దరికీ చేరో 3.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు..!!