వరుణ్ కంటే ముందే లావణ్య ఆ హీరోని ప్రేమించిందా.. అతడితో బ్రేకప్ రీజ‌న్ ఇదే..!

మెగా ఇంటికి కాబోయే కోడలు లావణ్య త్రిపాఠిపై గతంలో ఎన్నో వార్తలు కుప్పలు తిప్పలుగా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. మెగా ఇంటికి కోడలుగా వెళుతున్న లావణ్య త్రిపాఠి మెగా హీరోలతోనే ఎఫై.. *ర్లు నడిపిందంటూ వార్తలు ఒకప్పుడు సోషల్ మీడియాలో తెగ వినిపించేవి. లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ కంటే ముందే అల్లు శిరీష్ తో ప్రేమాయణం నడిపిందని శ్రీరస్తు శుభమస్తు సినిమా టైంలో వీరిద్దరూ క్లోజ్ గా ఉండేవారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

సాయి ధరమ్ తేజ్ – లావణ్య త్రిపాఠి మధ్య కూడా ఎఫై..*ర్ వార్తలు నడిచిన సంగతి చాలా మందికి తెలుసు. ఓ ఇంటర్వ్యూలో సాయి ధరమ్‌తేజ్ అంటే ఇష్టమని లావణ్య త్రిపాఠి అప్పట్లో అనడంతో ఆ వార్తల‌కి మరింత క్రేజ్ పెరిగింది. ఇక వ‌రుణ్‌ తేజ్ – లావణ్య త్రిపాఠి ఎప్పటినుంచో లవ్ లో ఉన్నారన్న‌ది తెలిసిందే. వీరిద్దరూ ఆ బంధం సీక్రెట్ గా మెయింటెన్ చేస్తూ ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక పైన చెప్పిన హీరోల‌కంటే ముందే లావణ్య మరో హీరోతో ప్రేమాయణం నడిపిందట. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో న‌వీన్ చంద్రతో కలిసి అందాల రాక్షసి సినిమాలో నటించింది. ఇందులో రాహుల్ రవీంద్రన్‌ కూడా హీరోగా నటించారు. సినిమా షూటింగ్ టైంలో లావణ్య – నవీన్ చంద్ర మధ్య ప్రేమాయ‌ణం నడిచిందట‌. వీరిద్దరి మధ్య ప్రేమ పబ్బులు, పార్టీలు, డిన్నర్లు అంటూ ఎంజాయ్ చేసే రేంజ్ లో సాగేదని అప్ప‌ట్లో టాక్ ?

వీరిద్దరి మధ్యన ఉన్న ఆ లవ్ వల్లే తర్వాత బ్రాహ్మణ్, లక్ష్మీ దేవికి ఓ లెక్కుంది లాంటి ఎన్నో సినిమాల్లో నటించారు అంటూ వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత నవీన్ చంద్ర సినీ కెరీర్ అంతగా సక్సెస్ అవ్వకపోవడంతో అతడిని దూరంగా పెట్టి లావ‌ణ్య బ్రేకప్ చెప్పిందని నవీన్ చంద్ర ఇండస్ట్రీలో హీరోగా మంచి హోదాలో ఉంటే కచ్చితంగా లావణ్య.. నవీన్ చంద్రనే వివాహం చేసుకునేదని గుస‌గుస‌లు న‌డిచాయి.