క్యూట్ యాక్ట్రెస్ లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పలకరించింది. ఈ సినిమాలో అమాయకంగా, క్యూట్‌గా, లేలేత అందాలతో, ముచ్చటైన హావభావాలతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. అందాల రాక్షసితో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత దూసుకెళ్తా, మనం, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన వంటి సినిమాలలో గొప్పగా నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన ఈ తార త్వరలోనే మెగా కోడలుగా నాగబాబు ఇంట అడుగుపెట్టనుంది.
ఈ ముద్దుగుమ్మ వరుణ్‌తో గత ఐదారేళ్లుగా ఘాటు ప్రేమాయణం కొనసాగిస్తోంది. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. వీరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో లావణ్య త్రిపాఠి గతంలో మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడిన వీడియోలను అభిమానులు వైరల్ చేస్తున్నారు. తాజాగా లావణ్య చిరంజీవి గురించి మాట్లాడిన ఒక వీడియో కూడా వైరల్ అవుతోంది. ఈ వీడియో అర్జున్ సురవరం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సమయం నాటిది. ఇందులో యాంకర్ సుమ లావణ్యను కొన్ని ప్రశ్నలు వేసింది. వాటిలో మెగా ఫ్యామిలీ గురించి కూడా ఒక ప్రశ్న ఉంది.
యాంకర్ సుమ లావణ్యను ఉద్దేశిస్తూ “చిరంజీవి, పవన్ కళ్యాణ్, హీరో నిఖిల్.. ఈ ముగ్గురితో కలిసి నటించే అవకాశం ఒకేసారి వస్తే, ఏ హీరోతో నటించడానికి మీరు ఇష్టపడతారు?” అని ప్రశ్నించింది. ఈ ప్రశ్న విన్న తర్వాత లావణ్య కాసేపు ఆలోచించింది.
ఆ తర్వాత చిరంజీవి అని సమాధానం చెప్పింది. చిరుతోనే కలిసి నటిస్తానని చెప్పడానికి గల కారణాన్ని కూడా ఆమె వివరించింది. పవన్ కళ్యాణ్ నిఖిల్ ఇద్దరితో పోలిస్తే చిరు చాలా సీనియర్ కాబట్టి అతనితోనే ముందుగా నటించడానికి ఇష్టపడతా అని లావణ్య సమాధానం ఇచ్చింది. కాగా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. “పెద్ద మామయ్యపై లావణ్యకి బాగానే మోజు ఉంది” అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.