జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాల్లో ల‌క్ష్మీప్ర‌ణ‌తికి పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చే సినిమా తెలుసా…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి హంగులు, ఆర్భాటాలకు దూరంగా ఇంటిపట్టునే ఎక్కువగా ఉంటారు. లక్ష్మీ ప్రణతికి కేవలం 17 సంవత్సరాల వయసులోనే 2011లో జూనియర్ ఎన్టీఆర్ తో వివాహం జరిగింది. ఈ దంపతులకు భార్గవ్‌రాం, అభయ్ రామ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. లక్ష్మీ ప్రణతి మిగిలిన టాలీవుడ్ స్టార్ హీరోల భార్యల్లా సోషల్ మీడియాలోనూ బయట హడావిడి చేసేందుకు పెద్దగా ఇష్టపడరు.

ఆమె సాంప్రదాయాలకు అనుగుణంగా తమ దాంపత్య జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడుతూ ఉంటారు.
అయితే ఇటీవల మాత్రమే లక్ష్మీ ప్రణతి తన బర్త్ డే వేడుకలకు కొందరు హీరోల ఫ్యామిలీలతో కలిసి చేసుకుంది. లక్ష్మీ ఇంటర్ చదువుతున్నప్పుడే ఎన్టీఆర్ తో ఆమెకు వివాహం జరిపించేశారు. అప్పటికి ఆమెకు సినిమాల గురించి అవగాహన ఉన్నా… మరి అంత డెప్త్ నాలెడ్జ్ అయితే లేదట.

పెళ్లికి ముందు ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాలు ఆమె చూసినా స్టూడెంట్ నెంబర్ 1 సినిమా అంటే ప్ర‌ణ‌తికి చాలా ఇష్టం అట. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాను తన స్నేహితులు.. తన కుటుంబ సభ్యులతో కలిసి చాలాసార్లు చూసింది అట. అయితే ఎన్టీఆర్ ఆది – సింహాద్రి లాంటి సినిమాలతో సూపర్ హిట్లు కొట్టినా.. తన భర్త యాక్షన్ సినిమాల కంటే స్టూడెంట్ నెంబర్ 1 లాంటి సినిమాలు చేస్తే చాలా బాగుంటుందని భ‌ర్త‌తో చెప్పేద‌ట‌.

ఇక బృందావనం సినిమా కూడా తనకు చాలా ఇష్టమని లక్ష్మీ ప్రణతి తన సన్నిహితులకు చెప్పేదట. దీనిని బట్టి చూస్తే ఎన్టీఆర్లో యాక్షన్ కన్నా స్టూడెంట్ నెంబర్ 1 – బృందావనం లాంటి ఫ్యామిలీ స్టోరీలు చేస్తే ఆమెకు బాగా నచ్చుతాయని తెలుస్తోంది.