లక్ష్మీ ప్రణతికి ఎన్టీఆర్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా.. అందుకే 8 నెల‌లు దూరం పెట్టిందా..!

నంద‌మురి నట వారసుడిగా ఆ ఫ్యామిలీ నుంచి మూడో త‌రం హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. తాతకు తగ్గ మనవడిగా సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ అటు వెండితెర‌తో పాటు ఇటు బుల్లితెర మీద కూడా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి క్యూట్ పెయిర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకోవడానికి 8 నెలలు టైం పట్టిందట. ఎన్టీఆర్‌ని లక్ష్మీ ప్రణతి ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుందన్న రూమర్లు అప్ప‌ట్లో వినిపించాయి.

Jr NTR and wife Lakshmi Pranathi are expecting their second child: Confirmed

అందుకే 8 నెలలు సమయం తీసుకుందన్న పుకార్లు అప్ప‌ట్లో బాగా వైర‌ల్ అయ్యాయి. ఈ విష‌యం స్వ‌యంగా ఎన్టీఆరే చెప్ప‌డం విశేషం. మీలో ఎవరు కోటీశ్వరుడు హోస్టింగ్ టైంలో హాట్ సీట్లో కూర్చున్న ఒక సెలబ్రిటీతో ఎన్టీఆర్ మాట్లాడుతూ మీ పెళ్లి ఓకే చేయడానికి నీకు నెలరోజులు పట్టిందట కదా ? అని ఎన్టీఆర్ అడుగుతూ.. నీకైతే నెల టైమే ప‌ట్టిందేమో కానీ.. నాకు ఏకంగా 8 నెలలు ప‌ట్టిందంటూ తన పెళ్లినాటి స్టోరీ జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.

Jr NTR's wife Lakshmi Pranathi makes her social media debut? | Telugu Movie  News - Times of India

ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిని చూడడానికి వెళ్ళినప్పుడే ఓకే చేసినా.. లక్ష్మీ ప్రణతి మాత్రం ఎన్టీఆర్ అంటే ఇష్టమని ఒక మాట కూడా చెప్పలేదట‌. దాంతో ఎన్టీఆర్ అసలు ప్ర‌ణ‌తికి తాను ఇష్టమా లేదా ? అని ఆలోచనలో పడి 8 నెలల సమయం తీసుకున్నానని చెప్పాడు. పెళ్లి అయిన తర్వాత కూడా లక్ష్మీ ప్రణతిని నీకు అసలు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా ? లేదా మీ పేరెంట్స్ చెప్పారని చేసుకున్నావా ? అని అడిగితే అప్పటికి ఆమె సమాధానం ఇవ్వలేదట‌.

Happy Birthday Jr NTR: Adorable family moments of RRR actor with wife  Lakshmi Pranathi and sons (In Pics) | Celebrities News – India TV

ఆ టైంలో ల‌క్ష్మీప్ర‌ణ‌తిని చూసి ఆడవాళ్ళ మనసుని అర్థం చేసుకోవడం చాలా కష్టమని.. లోలోపలే అనుకున్నానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ స్వ‌యంగా ఈ మ్యాట‌ర్ చెప్ప‌డంతో అప్పట్లో సోషల్ మీడియాలో లక్ష్మీ ప్రణతికి ఎన్టీఆర్ అంటే ఇష్టం లేదని.. అందుకే 8 నెలలు ఎన్టీఆర్ ని దూరంగా పెట్టిందంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ జంట‌కు ఇద్ద‌రు క్యూట్ పిల్ల‌లు ఉన్నారు. ఈ ఫ్యామిలీ ఎంత చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుందో ? తెలిసిందే.