ఆడవాళ్ల‌కు మంచి భ‌ర్త రావ‌డానికి గోరింటాకు ఇంత లింక్ ఉందా ?

గోరింటాకు అంటే ఇష్టపడని ఆడవాళ్ళని చేతిపై లెక్క పెట్టవచ్చు. పెళ్లిళ్లు, పండగలు, ఫంక్షన్లు టైంలో అమ్మాయిలు చేతులు రకరకాల గోరింటాకు డిజైన్లతో ఎర్రగా మెరిసిపోతాయి. అలాంటి గోరింటాకు ప్రత్యేకించి ఆషాడంలో పెట్టుకోవాలంటుంటారు పెద్దలు. అసలు ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైంది? గోరింటాకు ప్రాముఖ్యత ఏంటి? ఒకసారి తెలుసుకుందాం.

గౌరీదేవి తన చిన్నప్పుడు చెలి క‌త్తెల‌తో వనంలో ఆడుకుంటుండగా ర‌జ‌స్వ‌ల జ‌రిగి ఓ రక్తపు చుక్క నేలను తాకడంతో అక్క‌డ ఓ మొక్క పుడుతుంది. చెలిలు పర్వత రాజు హిమవంతుడికి ఈ విష‌యం చెప్పడంతో ఆయన భార్యతో కలిసి వెంటనే అక్కడికి వస్తాడు. ఆయన వచ్చేటప్పటికి చిన్న మొక్క కాస్త వృక్షంగా మారిపోతుంది. ఆ వృక్షం నావల్ల లోకానికి ఎలాంటి ఉపయోగం ఉంటుంది అని గౌరీదేవిని అడగగా పార్వతి దేవి చిన్న‌పిల్ల కావ‌డంతో ఆ చెట్టు ఆకుని కోస్తుంది. వెంటనే ఆమె లేత చేతులు ఎర్రగా కందిపోతాయి.

దీంతో గౌరీదేవి తల్లిదండ్రులు అయ్యో బిడ్డ చేతులు ఎర్రగా కందిపోయాయి అని చింతిస్తూ ఉంటారు. వెంటనే పార్వతీదేవి నాకు ఎలాంటి నొప్పి కలగలేదు.. పైగా ఇది నా చేతులకు అలంకారంలా అనిపిస్తుంది అని చెప్తుంది. దీంతో హిమవంతుడు స్త్రీ సౌభాగ్య చిహ్నంగా గోరింటాకును భూలోకంలో పెట్టుకుంటారు. ఈ వృక్షం ప్రసిద్ధి చెందుతుంది అని వరం ఇస్తాడు. దీంతోపాటు గౌరీదేవికి వృక్షం అంటే ఇష్టం కాబట్టి ఆమె పేరు వృక్షానికి వచ్చేటట్లు గోరింటాకు అనే పేరు పెడతాడు.

ఈ గౌరింటాకును చేతి అలంకరణగా మానవులు ఉపయోగించడం మొదలుపెట్టిన తరువాత మెల్లమెల్లగా పేరు కాస్త గోరింటాకు గా మార్పు చెందింది. ఈ ఆకు చేతులకు, కాళ్ళ‌కి అలంకారంగా ఉండ‌టంతో భూలోకంలో జనులంతా గోరింటాకు పసరుతో చేతులు కాళ్లు అందంగా తీర్చిదిద్దుకుంటారు. ఈ క్రమంలో కుంకుమకు ఓ సందేహం కలుగుతుంది. నుదుటన కూడా గోరింటాకునే పెట్టుకుంటారేమో దాని వల్ల నా ప్రాధాన్యత తగ్గిపోతుందంటూ గౌరీదేవి దగ్గర మొరపెట్టుకోగా గౌరీదేవి గోరింటాకు నుదిటిన‌ పెడితే పండదని.. కుంకుమకు చెబుతుంది. గోరింటాకు నుదుటిపై పెడితే పండక పోవడానికి కారణం ఇదే.

గర్భాశయ సమస్యలకు ఔషధంలా గోరింట :
ర‌జ‌స్వ‌ల‌ టైంలో మొలకెత్తిన ఈ చెట్టు స్త్రీలకు గర్భాశయ సమస్యలను తగ్గిస్తుంది. అరచేతిలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు అరచేతిలోనే ఉండడంతో శరీరంలో వేడిని తొలగించి, స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గోరింట డెలివరీ కాగానే గర్భాశ‌య‌ సమస్యలను నయం చేయడానికి ముద్దుగా నూరి బాలింత చేత మింగేస్తారట.

మంచి భర్త రావడానికి గోరింటాకుకి లింక్ ఏంటంటే :
ఆడవారిలో హార్మోన్లు పనితీరు చక్కగా ఉంటే శరీరం అందంగా సున్నితంగా క‌నిపించడంతో పాటే ఆరోగ్యం కూడా లభిస్తుంది. స్త్రీ అరచేతిలో పండిన గోరింటాకు ఆడవారి ఆరోగ్యాన్ని సూచిస్తుందట. ఆడవారు ఆరోగ్యంగా ఉంటే ఇంటిని శ్రద్ధగా చూసుకుంటారు. దీంతో భర్తలకు కూడా వారిపై ప్రేమ పెరిగి భార్యలను బాగా చూసుకుంటారనే ఉద్దేశంతో గోరింటాకు పెట్టుకుంటే మంచి మొగుడు వస్తాడు అని చెప్పేవారట.

అలాగే గోరింటాకు సంవత్సరానికి ఒకసారి పుట్టింటికి గౌరీదేవి దగ్గరకు వెళుతుందట. ఆ సమయంలో న‌న్ను మర్చిపోకుండా పెట్టుకోవాలని గోరింటాకు గౌరీదేవిని ఓ వరం కోరిందట. అందుకే ఆడవారంతా ఆషాడంలో కచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలని పెద్ద‌వాళ్ళు చెబుతుంటారు.