ప్రభాస్‌తో కృతిస‌న‌న్ బ్రేక‌ప్‌.. నోటీసులు కూడా పంపిందిగా…!

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. తరువాత వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. రీసెంట్‌గా ఆదిపురుష్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ప్ర‌భాస్ త్వ‌ర‌లోనే స‌లార్‌, ప్రాజెక్ట్ కే సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

ఆది పురుష్ సినిమా షూటింగ్ టైంలో ప్రభాస్ – కృతి స‌న‌న్ ప్రేమించుకుంటున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే వీరిద్దరి ప్రేమ తెలిసిన‌ అనుష్క – ప్రభాస్‌ని దూరం పెట్టిందన్న రూమ‌ర్లు వ‌చ్చాయి. గతంలో అనుష్క – ప్రభాస్ ప్రేమ‌లో ఉన్నార‌న్న పుకార‌ర్లు ఉన్నాయి.

అయితే కృతి సనన్‌ని ప్రభాస్ ప్రేమిస్తున్నాడ‌న్న విషయం తెలిసి ప్రభాస్‌కి అనుష్క బ్రేకప్ చెప్పిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఆది పురుష్‌ సినిమా షూటింగ్ దగ్గర నుంచి పూర్తయ్యే వరకు కృతి సనన్ – ప్రభాస్ లవ్ ఎఫై..*ర్ పై వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ వార్తలకు స్పందించిన కృతి సనన్‌ అదేమీ లేదంటూ క్లారిటీ ఇచ్చింది.

అయినా ప్రముఖ ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు వీటిని ప‌ట్టించుకోకుండా డార్లింగ్ తో గొడవ పడిన కృత్తి అత‌డికి బ్రేకప్ చెప్పిందని ఘాటుగా ట్విట్ చేశాడు. దీంతో ఫైర్ అయిన కృతి స‌న‌న్‌ తనపై తప్పుడు వార్తలు రాసినందుకు ఉమర్ సంధు పై డిఫార్మేషన్ కేసు వేసింది. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫిలిం ఉమైర్ సంధు లైట్ తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుత ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.