ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది కృతిశెట్టి. తన మొదటి సినిమాతోనే స్టార్ డంను సంపాదించుకున్న కృతి ఆ తరువాత ఎన్ని సినిమాల్లో నటించినా అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఆమె నటించిన అన్ని సినిమాలు వరుసగా డిజాస్టర్లు అవుతుండడంతో ఆమెను ఓ ఐరెన్ లెగ్ హీరోయిన్ అంటూ ముద్ర వేసేశారు.
ఉప్పెన తర్వాత నటించిన శ్యాం సింగరాయ్, బంగార్రాజు సినిమాలు మిడియం హిట్ గా నిలిచినా మిగిలిన అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో ఏం అవకాశాలు లేవని చెప్పాలి. అయితే మొదటి సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న కృతిశెట్టి తర్వాత వరుస ఫ్లాప్స్ రావడంతో ఆమె నటిస్తే ఆ సినిమా ప్లాప్ అని టాక్ వచ్చేసింది.
కృతి తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా సూర్య, కార్తి లాంటి స్టార్ హీరోల సరసన నటిస్తుంది. టాలీవుడ్ లో ప్రస్తుతం బిజీగా ఆవకాశలు లేనప్పటికీ కోలీవుడ్ లో కృతి క్రేజ్ బాగానే ఉంది. కోలీవుడ్ స్టార్ హీరోలు కూడా కృతి డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారంటే అర్థమైపోతుంది. అయితే అలాంటి కృతి శెట్టి కి ఒక స్టార్ హీరో కొడుకు టార్చర్ చూపిస్తున్నాడట. ఎలాగైనా కృతి శెట్టితో ఫ్రెండ్షిప్ చేయాలని.. ఆ స్టార్ హీరో ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నాడట.
ప్రతి ఈవెంట్ కి తన వెంట తిరుగుతూ ఇబ్బంది పెడుతున్నాడని.. ఇటీవల షూటింగ్ మానుకొని తన బర్త్ డే పార్టీ కి రావాలని.. ఎన్ని కోట్లు అయినా ఇస్తా వస్తావా అంటు ఫోన్లు చేసి విసిగిస్తున్నాడంటూ కృతి శెట్టి స్వయంగా ఇటీవల ఒక తమిళ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే ఆ పార్టీకి వెళ్లడం ఇష్టం లేని కృతి శెట్టి నేను ఏ పార్టీలకు రానని కాల్ కట్ చేసిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎవరు ఆ స్టార్ హీరో కొడుకు..? అంటూ ఆసక్తిగా చర్చలు జరుగుతున్నాయి.