గత కొంతకాలంగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అతడి భార్య సంగీత విడాకులు తీసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో ఒక్కటే వార్తలు వైరల్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రధానంగా సంగీత – విజయ నిర్వహించిన ఏ ప్రోగ్రామ్స్ లోను పార్టిస్పేట్ చేయకపోవడం.. విజయ్ విద్యార్థులను ప్రోత్సాహించిన కార్యక్రమాలలో కూడా సంగీత హాజరు కాకపోవడంతో వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారంటూ.. తన బిడ్డల సంరక్షణ బాధ్యతలను కోసం విదేశాల్లో సంగీత ఉన్నట్లు ప్రచారం జరిగింది.
అలాంటిది ఒక్కసారిగా శుక్రవారం సంగీత ముఖానికి ముసుగు వేసుకొని మరి శివ కార్తికేయన్ నటించిన మూవీరన్ సినిమా చూడడానికి చెన్నైలోని ఓ థియేటర్‌కి వచ్చారు. ఇది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఆమె రావడం ఈ సినిమాకి అదనపు ప్రచారం తీసుకొచ్చింది. దీంతో విజయ్ అభిమానులు తెగ ఆనంద పడిపోతున్నారు. కారణం ఇటీవల విజయ్ నిర్వహించిన ఏ కార్యక్రమానికి హాజరు కాని సంగీత త్వరలోనే విజయ్ నటించిన లియో ఆడియో లాంచ్ ప్రోగ్రామ్‌కు వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.
సంగీత మూవీరన్ సినిమా మొదటిరోజు మొదటి షోని చూడడానికి రావడం విశేషం. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమా ఈనెల 14న థియేటర్లో రిలీజ్ అయింది. మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా తెలుగులో మహావీరుడు పేరుతో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది.
ఈ సినిమా షో చూసేందుకు సంగీత రావడంపై కొందరు విజయ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేయగా… మరి కొంతమంది భర్త జరుపుతున్న ప్రోగ్రామ్స్‌కు రాకుండా… శివ కార్తికేయన్ సినిమాలకు వచ్చిందంటే అతడు ఎంత టాప్ హీరోనో అర్థం చేసుకోవచ్చు అంటూ.. శివ కార్తికేయన్‌కి అనుకూలంగా కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా సంగీత విజయ్ విడాకుల వార్తలకు అయితే ఫుల్‌స్టాప్ పడింది.